Dharani
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2024-25 తొలి త్రైమాసికం ఫలితాల్లో సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..
ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2024-25 తొలి త్రైమాసికం ఫలితాల్లో సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..
Dharani
గత ఏడాదంతా ఐటీ కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడిన సంగతి తెలిసిందే. ఎంఎన్‌సీలు మొదలు.. చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. దాంతో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. గతేడాది మొత్తం.. చాలా వరకు ఐటీ కంపెనీలు ఆర్థిక మందగమనంలోనే కొనసాగాయి. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో.. డిమాండ్ తగ్గి.. చాలా కంపెనీలకు ఆర్డర్లు కూడా సరిగా రాలేదు. దాంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక కంపెనీలు వేతనాలు తగ్గించాయి.. వర్క్ ఫ్రమ్ హోం ఎత్తేశాయి.. ప్రోత్సాహకాల్లో కూడా కోతలు విధిస్తూ వచ్చాయి.
అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి కాస్త మారింది. తొలి త్రైమాసికంలో అనేక కంపెనీలు లాభాల బాట పట్టాయి. టీసీఎస్ సహా అనేక కంపెనీలు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కి గాను.. మంచి లాభాల్ని ప్రకటించాయి. గతేడాది ఇదే సమయంలో టీసీఎస్‌లో ఉద్యోగాలు తగ్గగా.. ఈ ఏడాది క్యూ1లో మాత్రం మళ్లీ ఉద్యోగుల సంఖ్యను 5 వేల వరకు పెంచుకుంది. ఇక మరో దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించగా సంచలన విషయాలు ప్రకటించింది. ఆ వివరాలు..
ప్రముఖ ఐటీ సంస్థ, టీసీఎస్ తర్వాత రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ గురువారం నాడు కూడా మొదటి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. ఫస్ట్ క్వార్డర్ ఫలితాల్లో.. ఇన్ఫోసిస్ నికర లాభం 7.10 శాతం పెరిగి రూ. 6368 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా.. మార్చి క్వార్టర్‌తో చూస్తే మాత్రం 20 శాతం వరకు పడిపోయింది. అయినప్పటికీ అంచనాల్ని మాత్రం మించింది. ఫలితాల పరంగా బాగానే ఉన్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య మరోసారి తగ్గుముఖం పట్టింది.
ఏప్రిల్- జూన్ సమయంలో ఇన్ఫోసిస్ సంస్ధ నుంచి వెళ్లిపోయిన వారు లేదా లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగుల సంఖ్య 1908 గా ఉంది. మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఇన్ఫీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,17,240 గా ఉండగా.. ఇప్పుడు అది 3,15,332 కు చేరింది. ఇక ఏడాది కిందటితో చూస్తే ఈ వ్యవధిలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య ఏకంగా 2,962 తగ్గిపోయింది.
అలానే గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారికి ఇన్ఫోసిస్‌లో అట్రిషన్ అనగా వలసల రేటు పెరిగింది. అంటే కంపెనీలు మారే సిబ్బంది అన్నమాట. కిందటి త్రైమాసికంలో అట్రిషన్ రేటు ఇన్ఫోసిస్‌లో 12.6 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 12.7 శాతానికి పెరిగింది. ఇటీవల ఫలితాల్ని ప్రకటించిన టీసీఎస్ మాత్రం ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న సంగతి తెలిసిందే. 3 నెలల వ్యవధిలో ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,452 పెరిగింది. అలానే మరో దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థలో అంతకు ముందు ఉద్యోగుల సంఖ్య పెరగ్గా.. ఏప్రిల్ – జూన్ సమయంలో ఏకంగా 8,080 మంది ఉద్యోగులు తగ్గారు.