P Venkatesh
పాన్ కార్డు నెంబర్ తక్షణమే కావాలంటే ఏ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఇన్ స్టంట్ ఈ పాన్ పొందే అవకాశం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఎలా పొందొచ్చంటే?
పాన్ కార్డు నెంబర్ తక్షణమే కావాలంటే ఏ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఇన్ స్టంట్ ఈ పాన్ పొందే అవకాశం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఎలా పొందొచ్చంటే?
P Venkatesh
పాన్.. పర్మినెంట్ అకౌంట్ నెంబర్. దీన్ని భారత ఆదాయపన్ను శాఖ జారీ చేస్తుంది. దీన్ని ఐడెంటిఫికేషన్ పత్రంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో అనేక పనులకు పాన్ కార్డ్ తప్పనిసరిగా మారింది. పాన్ కార్డుతో అనేక ఉపయోగాలున్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం. బ్యాంక్ ఖాతా తెరిచేందుకు కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అదే విధంగా రూ.50,000 డిపాజిట్లకు కూడా పాన్ అవసరం అవుతుంది. క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు, డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించేందుకు కూడా పాన్ అవసరం అవుతుంది.
ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పాన్ కార్డ్ నెంబర్ తక్షణమే కావాలంటే ఎలా? కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. ఇలాంటి వారికి వెంటనే ఈ-పాన్ పొందే సదుపాయం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఈ- పాన్ ను పూర్తి ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?. ఇంట్లో కూర్చోని ఈ-పాన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఇందుకోసం ఆవ్యక్తి ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి అది మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. ఈ విధంగా నిమిషాల్లోనే ఈ పాన్ ను పొందొచ్చు.