Kisan Vikas Patra Scheme: మీ పెట్టుబడి డబుల్ అయ్యే పోస్టాఫీస్‌ స్కీం..సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్.. లక్షల్లో లాభం పక్కా!

మీ పెట్టుబడి డబుల్ అయ్యే పోస్టాఫీస్‌ స్కీం..సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్.. లక్షల్లో లాభం పక్కా!

Kisan Vikas Patra Scheme: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే బెస్ట్ స్కీమ్. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ తో మెచ్యూరిటీ సమయానికి లక్షల్లో లాభం పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

Kisan Vikas Patra Scheme: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే బెస్ట్ స్కీమ్. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ తో మెచ్యూరిటీ సమయానికి లక్షల్లో లాభం పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?

ఆర్థికంగా బలంగా ఉన్నామంటే భవిష్యత్తు అంతా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే మంచిది. అయితే పొదుపు చేసిన సొమ్మును పెట్టుబడిగా మార్చుకుంటే మీ సంపద వృద్ధి చెందుతుంది. తెలివైన పెట్టుబడి మీ డబ్బును రెట్టింపు చేస్తుంది. మరి మీరు కూడా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ సూపర్ హిట్ స్కీం గురించి మీకు తెలుసా? పోస్టీఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం పక్కాగా వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. రిస్క్ లేని హామీతో కూడిన రాబడిని పొందొచ్చు. మీ పెట్టుబడి భద్రంగా ఉంటుంది.

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర పథకం ఒకటి. దీనిలో పెట్టుబడి పెడితే అది రెండింతలు అవుతుంది. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అందుకోవచ్చు. ఈ పథకంలో కనిష్టంగా 1000 ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 100 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తంపై 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా 3 కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.5000 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత రూ.10,000 పొందుతారు. లక్ష ఇన్వెస్ట్ చేస్తే రెండు లక్షలు పొందొచ్చు. అదే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10 లక్షలు పొందొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే 100 నెలల్లో అంటే 8 సంవత్సరాల 4 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

Show comments