Post Office Recurring deposit scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు 200 పెట్టుబడితో.. చేతికి 10 లక్షలు.. ఎలా అంటే?

పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రోజుకు 200 పెట్టుబడితో.. చేతికి 10 లక్షలు.. ఎలా అంటే?

Post Office Recurring deposit scheme: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో పెట్టుబడిపెడితే అధిక లాభాలు పొందొచ్చు. రోజుకు 200 పెట్టుబడితో.. చేతికి 10 లక్షలు వస్తాయి.

Post Office Recurring deposit scheme: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ లో పెట్టుబడిపెడితే అధిక లాభాలు పొందొచ్చు. రోజుకు 200 పెట్టుబడితో.. చేతికి 10 లక్షలు వస్తాయి.

పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలను పొందాలనుకునే వారికి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అదిరిపోయే స్కీములను ప్రవేశపెడుతున్నది. గవర్నమెంట్ పథకాల్లో పెట్టుబడిపెడితే ఏ రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడులు పొందొచ్చు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే లక్షల్లో లాభం అందుకోవచ్చు. మీరు రోజుకు 200 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి చేతికి 10 లక్షలు అందుకోవచ్చు. అధిక రాబడులు అందుకోవాలనుకునే వారు పోస్టాఫీస్ అందించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆ పథకం పేరు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్.

తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో అధిక లాభాలను పొందాలంటే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ స్కీమ్‌లో నెల నెలా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు లేదా 60 నెలలు ఉంటుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మీద కేంద్రం 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వడ్డీ రేటు అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. అలాగే ఈ స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత కావాలంటే మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో చేరి రూ. 10 లక్షలు పొందాలనుకుంటే.. రోజుకు 200 చొప్పున నెలకు రూ. 6 వేలు పెట్టుబడిపెట్టాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి మీ పెట్టుబడి రూ. 72 వేలు అవుతుంది. 5 ఏళ్లకు 360000 జమ అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం 68197 వడ్డీ జమ అవుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 4,28,197 చేతికి అందుతుంది. అయితే మీరు ఈ స్కీమ్ ను మరో ఐదేళ్లు పొడిగించినట్లైతే.. అప్పుడు 10 ఏళ్ల మెచ్యూరిటీకి మీ పెట్టుబడి రూ. 7,20,000 అవుతుంది. వడ్డీతో కలుపుకుని మొత్తం మీ చేతికి రూ. 10,25,121 అందుతుంది.

Show comments