P Venkatesh
Amazon Prime Day Sale 2024: కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కాబోతున్నది. ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనున్నది. వేలల్లో లాభం పొందొచ్చు.
Amazon Prime Day Sale 2024: కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అమెజాన్ ప్రైమ్ డే సేల్ త్వరలో ప్రారంభం కాబోతున్నది. ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనున్నది. వేలల్లో లాభం పొందొచ్చు.
P Venkatesh
ప్రముఖ ఈకామర్స్ సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ప్రొడక్టులపై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్, సమ్మర్ సేల్, ప్రైమ్ డే సేల్ ద్వారా యూజర్లకు బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలో అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నది. ఈ సేల్ లో ఫోన్స్ పై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో పాల్గొనే వారికి వేలల్లో లాభం చేకూరనున్నది. ఇంతకీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఎప్పుడు ప్రారంభంకాబోతుందంటే?
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 20, 21 తేదీల్లో ప్రారంభంకానున్నది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ప్రైమ్ మెంబర్స్ కు భారీ డిస్కౌంట్స్ అందించనున్నది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఇంటెల్, శాంసంగ్, వన్‌ప్లస్, హానర్, ఐకూ, బజాజ్, ఆగ్రో, క్రాంప్టన్, సోనీ, ఐటీసీ, ఫాజిల్, పుమా, మోటోరొలా, బోట్ వంటి బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్/ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. ఐసీఐసీఐ, అమెజాన్ పే క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్ మెంబర్లకు వెల్‌కమ్ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలు కలుగనున్నాయి. నాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఇస్తోంది.