అలర్ట్: రేపు ఒక్కరోజు ఆ బ్యాంకు సేవలు బంద్! అమౌంట్ అవసరం ఉంటే ఈరోజే డ్రా చేసుకోండి!

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆ సేవలు నిలిచిపోనున్నాయి. ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఇంతకీ ఆ సేవలు ఏంటీ? ఎప్పటి నుంచి బంద్ కానున్నాయి. ఆ వివరాలు మీకోసం

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆ సేవలు నిలిచిపోనున్నాయి. ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఇంతకీ ఆ సేవలు ఏంటీ? ఎప్పటి నుంచి బంద్ కానున్నాయి. ఆ వివరాలు మీకోసం

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక బ్యాంక్ సేవలు చాలా వరకు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఖాతాదారులకు బ్యాంకు సేవలు మరింత సులభంగా అందుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. ఎంచక్కా కూర్చున్న చోటు నుంచే బ్యాంకుకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ సేవలకు అంతరాయం కలిగినప్పుడు మాత్రం కాస్త ఇబ్బందికి గురికావాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో ప్రముఖ బ్యాంకు తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఆ సేవలు నిలిచిపోనున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఆ ఒక్క రోజు ఆ సేవలు డౌన్ కానున్నాయి. ఇంతకీ ఆ సేవలు ఏంటి? ఎప్పటి నుంచి బంద్ కానున్నాయి. ఆ వివరాలు మీకోసం..

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన ఖాతాదారులకు అలర్ట్ సందేశాలను పంపించింది. మే 25వ తేదీన నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని తెలిపింది. రేపు కొంత సమయం పాటు హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందలేరని తెలిపింది. మీకు డబ్బు అవసరముంటే ఈ రోజే డ్రా చేసుకోండి. కాగా ఈ అంతరాయం వల్ల ఖాతాదాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్ ను చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లి మీకు కావాల్సిన సేవలను పొందొచ్చు. హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకే అప్ డేట్ చేస్తూ ఉంటుంది.

అకౌంట్ హోల్డర్లకు దీనికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసింది. అయితే ఆయా సేవలు నిలిచిపోనుండడానికి గల కారణాన్ని బ్యాంక్ వెల్లడించింది. మెయిటెనెన్స్ కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, మొబైలి బ్యాంకింగ్ యాప్‌లో పలు ట్రాన్సాక్షన్ల అందుబాటులో ఉండవని చెప్పింది. మే 25వ తేదీన ఉదయం 3.30 నుంచి 6.30 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అకౌంట్లు, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్లు ఆన్‌లైన్ పేమెంట్లు సహా పలు ఇతర ట్రాన్సాక్షన్లు మే 25, 2024 రోజున ఉదయం 3.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లు యూపీఐ చెల్లింపులు చేయలేరని తెలిపింది.

Show comments