యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు ప్రారంభించిన ఈ-కామర్స్‌ సంస్థ

Flipkart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ యూజర్ల కోసం కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవలతో మరింత ప్రయోజనం కలుగనున్నది. ఇంతకీ అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీసులు ఏంటంటే?

Flipkart: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ యూజర్ల కోసం కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవలతో మరింత ప్రయోజనం కలుగనున్నది. ఇంతకీ అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీసులు ఏంటంటే?

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు యూజర్లకు కావాల్సిన ప్రొడక్ట్స్ ను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్న విషయం తెలిసిందే. ఎవరికి కావాల్సిన వస్తువులను వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు అందించే సేవలతో యూజర్లకు చాలా బెనిఫిట్స్ కలుగుతున్నాయి. అయితే యూజర్లకు మరిన్ని సేవలను అందించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ అందించింది. ఫ్లిప్ కార్టు కొత్త సేవలను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో ఫాస్టాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌లు, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపులను అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్టు డిజిటల్ పేమెంట్స్ సేవలను విస్తరించేందుకు బిల్ డెస్ట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. సంస్థ పేమెంట్స్ అండ్ సూపర్ కాయిన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ.. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ (బీబీపీఎస్‌)తో కొత్త సేవలను ఏకీకృతం చేయడానికి బిల్‌డెస్క్‌తో కుదిరిన ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ సేవలకు ఈ కొత్త సర్వీసులు అదనంగా తీసుకొచ్చామన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ ద్వారా లావాదేవీలు చేసి 10 శాతం వరకు సూపర్‌కాయిన్లను రెడీమ్‌ చేసుకోవచ్చు.

కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని గౌరవ్ అరోరా చెప్పారు. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ సులభతరం అయిపోయింది. చిన్ని చిన్న షాపుల దగ్గర్నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్, హోటల్స్ ఇలా అన్ని రకాల పేమెంట్స్ ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్ కార్ట్ యూజర్ల కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Show comments