Employees Must Be Aware Of These Rules: ఈ రూల్స్ గురించి ఉద్యోగులు ఖచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు

ఈ రూల్స్ గురించి ఉద్యోగులు ఖచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే ఇబ్బంది పడతారు

Employees Must Be Aware Of These Rules: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఖచ్చితంగా ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. జీతాల నుంచి పీఎఫ్ కట్ అయ్యే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఈపీఎఫ్ఓ నిబంధనల గురించి తెలుసుకోవాలి.

Employees Must Be Aware Of These Rules: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఖచ్చితంగా ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. జీతాల నుంచి పీఎఫ్ కట్ అయ్యే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఈపీఎఫ్ఓ నిబంధనల గురించి తెలుసుకోవాలి.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఖచ్చితంగా ఈ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతారు. చాలా మందికి ఇంట్లో కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కోసం డబ్బు అప్పటికప్పుడు అడ్జస్ట్ అవ్వడం అనేది సాధ్యపడదు. దీని కోసం తమ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఈ రూల్స్ గురించి తెలియకపోతే మీరు మీ డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాబట్టి ఈ రూల్ గురించి తెలుసుకోవాల్సిందే. ఏ అవసరాలకు మీ పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.. దానికి ఉన్న నియమాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలి.  

ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంటుంది. ఈ డబ్బులు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి. పీఎఫ్ ఖాతాల్లో జమ అయిన డబ్బుని పదవీ విరమణ ముందు వరకు ఉంచితే అధిక వడ్డీ అనేది వస్తుంది. కానీ కొంతమందికి కొన్ని అవసరాలు ఏర్పడతాయి. దీని కారణంగా ముందుగానే పీఎఫ్ డబ్బును తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మూడు రకాల అవసరాల కోసం మాత్రమే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. 58 సంవత్సరాల వయసు నిండిన తర్వాత మీరు మీ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బుని వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక సంస్థలో పని చేసే 2 నెలలు పనిలో లేనట్లయితే కనుక పీఎఫ్ డబ్బులను తీసుకోవచ్చు. పదవీ విరమణ సమయంలో ఉద్యోగి కాలం చెల్లితే పీఎఫ్ ఖాతాల నుంచి పీఎఫ్ డబ్బులను నామినీ పొందవచ్చు.

ఇవి కాకుండా ఇతర అవసరాల కోసం కూడా పీఎఫ్ డబ్బుని విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓ విధించిన కొన్ని నిబంధనలను అనుసరిస్తేనే పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. పెళ్లి ఖర్చుల కోసం పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును పొందవచ్చు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. పెళ్లి ఖర్చుల కోసం డబ్బును పొందాలనుకునేవారు.. కనీసం 7 సంవత్సరాలు పని చేసి ఉండాలి. అది ఒక కంపెనీలో కావచ్చు, రెండు మూడు కంపెనీల్లో కావచ్చు. మొత్తానికి కనీసం ఏడేళ్లు అయితే పని చేసి ఉండాలి. పెళ్లి ఖర్చుల కోసం పీఎఫ్ డబ్బుని మొత్తాన్ని క్లెయిమ్ చేయలేరని తెలుసుకోండి. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి దీర్ఘకాలికంగా వచ్చే వడ్డీలో కేవలం 50 శాతం మాత్రమే తిరిగి పొందగలుగుతారు. ఈ పెళ్లి ఖర్చులనేవి మీ కోసమే కాకుండా.. మీ కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, పిల్లల పెళ్లిళ్ల కోసం కూడా పీఎఫ్ డబ్బును పీఎఫ్ ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. 

Show comments