PF ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు పొందాలంటే ఈ పని చేయండి

Active UAN: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ ఓ బిగ్ అలర్ట్ ఇచ్చింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పై కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ పని చేయకపోతే ఆ సేవలు పొందలేరని తెలిపింది.

Active UAN: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ ఓ బిగ్ అలర్ట్ ఇచ్చింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పై కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ పని చేయకపోతే ఆ సేవలు పొందలేరని తెలిపింది.

సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగులకు ఆయా సంస్థలు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుంది. ఈ మొత్తానికి కంపెనీ తరఫున కొంత యాడ్ చేస్తుంది. పీఎఫ్ ఖాతాలో జమైన సొమ్ముకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ అందిస్తుంది. పీఎఫ్ నుంచి అవసరానికి కొంత డబ్బును డ్రా చేసుకోవచ్చు. రిటైర్ మెంట్ తర్వాత పెన్షన్ సైతం వస్తుంది. ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది. పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకొస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్ ఇచ్చింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. పీఎఫ్ ఖాతా ఉన్న వారు వెంటనే ఈ పని చేయకపోతే ఆ సేవలను పొందలేరని తెలిపింది. ఈపీఎఫ్ఓ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ లాంచ్ చేసింది. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి యూఏఎన్ నెంబర్ ను కేటాయిస్తుంది. పీఎఫ్ ఖాతాలన్నీ ఈ యూఏఎన్ నంబర్ కింద ఉంటాయి. అయితే ఈ యూఏఎన్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలి. లేదంటే ఆన్ లైన్ సేవలను పొందలేరని ఈపీఎఫ్ ఓ స్పష్టం చేసింది. యాక్టివ్ యూఏఎన్ లేని వారికి ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా ఏ సమాచారం పొందలేరు.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగులందరికీ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేట్ చేయండని ఈపీఎఫ్ఓ యాజమాన్యాలకు సూచించింది. కంపెనీలు తమ సంస్థలో చేరిన ఉద్యోగులందరికీ నవంబర్ 30, 2024లోపు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ చేయించాలి. ఫేస్ రికగ్నిజన్ టెక్నాలజీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించాలి. యూఏఎన్ యాక్టివేషన్ ఉన్నవారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సేవలు ఆన్‌లైన్ ద్వారా అందుతాయి. యూఏఎన్ యాక్టివ్ గా ఉండడం వల్ల సొంతంగా కేవైసీ వివరాలు ఎంటర్ చేయవచ్చు. గత కంపెనీ నుంచి పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అయితే, పాస్‌బుక్ డౌన్‌లోడ్, యూఏఎన్ కార్డు డౌన్‌లోడ్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ అర్హత చెక్ చేయడం, బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.

యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకునేందుకు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterfaceలోకి వెళ్లాలి. అక్కడ యాక్టివేట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత యూఏఎన్, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ పేరు, డెట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి ఇచ్చి గెట్ ఆథరైజేషన్ పిన్ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేసి వాలిడెట్ ఓటీపీ, యాక్టివేట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి. యూఏఎన్ యాక్టివేట్ అయి మీ ఫోన్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. యూఏఎన్, పాస్‌వర్డ్ ద్వారా మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ కావచ్చు. పీఎఫ్ ఖాతాదారులు వెంటనే యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకోండి.

Show comments