కార్మికులు, ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్మికులకు, ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సత్వరమే ప్రయోజనం చేకూరనున్నది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్మికులకు, ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సత్వరమే ప్రయోజనం చేకూరనున్నది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కార్మికులకు, ఉద్యోగులకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగి ప్రతి నెల తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఓకు చెల్లిస్తారు. అదే సమయంలో ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంతే మొత్తం ఈపీఎఫ్ ఓలో జమ అవుతుంది. ఈ మొత్తానికి ఈపీఎఫ్ ఓ వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఇక ఉద్యోగి, కార్మికులు రిటైర్ అయ్యే సమయానికి ఈపీఎఫ్ ఓలో జమ అయిన సొమ్ము అంత చేతికి అందుతుంది. ఈ క్రమంలో ఈపీఎఫ్ ఓ కార్మికులకు, ఉద్యోగులకు శుభవార్తను అందించింది. ఇకపై పదవీ విరమణ రోజే పెన్షన్ మంజూరు కానుంది. ఈ మేరకు ఈపీఎఫ్ ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ ఫండ్ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ‘ప్రయాస్‌’ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరులో ఆలస్యంపై మండిపడింది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజే సర్వీసు, వేతనం ఆధారంగా పింఛను ఖరారు చేసి, పింఛను మంజూరు పత్రాలు(పీపీవో) అందించాలన్న లక్ష్యం నాలుగు సంవత్సరాలుగా నెరవేరడం లేదని తెలిపింది. ఈపీఎఫ్‌వోలో డిజిటలీకరణలో భాగంగా ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో అర్హులైన వారికి పదవీ విరమణ రోజున పీపీవోలు మంజూరు చేయాలని ఈపీఎఫ్‌వో 2020లో ప్రయాస్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ క్లెయిమ్‌ల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరైన వివరాలు లేవన్న కారణాల చూపి పీపీవోలు మంజూరు చేయలేదు. ఈ వ్యవహారంపై ఇటీవల సమీక్ష నిర్వహించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీవిరమణ రోజే పీపీవోల మంజూరుకు.. జోనల్‌ కార్యాలయాలు పరిశ్రమలు, సంస్థల యజమానులకు, మూడునెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ (పింఛను) అప్రజిత జగ్గీ ఆదేశాలు జారీ చేశారు. ఈపీఎఫ్ ఓ ఆదేశాలతో కార్మికులు, ఉద్యోగులకు పదవీవిరమణ రోజే పెన్షన్ అందనుంది.

Show comments