EPFO కొత్త రూల్స్! తప్పనిసరిగా ఇవి అప్డేట్ చెయ్యాల్సిందే!

EPFO New Rule: ఉద్యోగుల ప్రావిడెంట్ అకౌంట్ కి సంబంధించి ఈపీఎఫ్ లో కొత్త రూల్ ప్రవేశ పెట్టారు.. ఈ మార్పు ప్రతి పీఎఫ్ ఖాతాదారులకు వర్తిస్తుంది.

EPFO New Rule: ఉద్యోగుల ప్రావిడెంట్ అకౌంట్ కి సంబంధించి ఈపీఎఫ్ లో కొత్త రూల్ ప్రవేశ పెట్టారు.. ఈ మార్పు ప్రతి పీఎఫ్ ఖాతాదారులకు వర్తిస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తాయన్న విషయం తెలిసిందే. ప్రతినెల వారి అకౌంట్ నుంచి కొంత మొత్తం పీఎఫ్ అకౌంట్ లో కట్ అవుతుంటాయి. పీఎఫ్ లో జమ అయిన డబ్బు సదరు ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.   ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనపుడు అత్యవసర సమయాల్లో పీఎఫ్‌లో జమ అయిన సొత్తును కొంత వరకు తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటీవల పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత సులభంగా అందించేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే  ఈపీఎఫ్‌వో మరో కొత్త రూల్ తీసుకువచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. పీఎఫ్ అకౌంట్ కి సంబంధించి ఈపీఎఫ్‌వో కొత్త రూల్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ ప్రతి ఒక్క పీఎఫ్ హూల్డర్ కి వర్తిస్తుంది తెలిపింది. మీరు పీఎఫ్ ఖాతాదారులై ఉంటే ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. పీఎఫ్ అకౌంట్‌లోని వివరాలు సరిచేయడాకి ఇంకా అప్డేట్ చేయడానికి ఈపీఎఫ్‌వో కొత్త నియమాలను ప్రవేశ పెట్టింది. పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారం అప్డేట్ చేయడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ) మార్గదర్శకాన్ని జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులు తమ ప్రొఫైట్ అప్డేట్ చేయడానికి ఎస్ఓపీ వెర్షన్ 3.0 ఆమోదించబడింది. ఈ కొత్త రూల్ ద్వారా యూఏఎన్ ప్రొఫైల్‌లో అప్డేట్ డాక్యూమెంట్స్ అందించాల్సి ఉంటుంది.

గత కొంత కాలంగా ఈపీఎఫ్‌వో తన మార్గదర్శకాల్లో పలు తప్పులు జరుగుతున్నాయని.. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందిన తెలిపింది. డేటా అప్డేట్ కాకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తతున్నాయని తెలిపింది. ఇక కొత్త రూల్స్ విషయానికి వస్తే.. 2 కేటగిరిల్లో మార్పులు ఉంటాయి. ఈపీఎఫ్‌వో ప్రొఫైట్ లోని మార్పులను చిన్నా, పెద్ద గ్రూపులుగా సపరేట్ చేయాల్సి ఉంటుంది. చిన్న మార్పులు జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థనతో పాటు 2 డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పెద్ద మార్పుల కోసం 3 డాక్యూమెంట్స్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది. ఉద్యోగి పర్సనల్ ప్రొఫైట్ ను అప్డేట్ చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపింది. ఆధార్ సంబంధింత మార్పుల విషయంలో మొబైల్ నంబర్ కు లింక్ చేయబడిన ఆధార్ కార్డు లేదా ఇ-ఆదార్ కార్డు సరిపోతుందని తెలిపింది.

Show comments