మరిన్ని చిక్కుల్లో జైజూస్‌ రవీంద్రన్‌! ED లుకౌట్‌ నోటీసులు

Byju's CEO Raveendran: కోవిడ్‌ సమయంలో ఎడ్యూకేషన్‌ రంగంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్‌ సంస్థ ప్రస్తుతం దివాలా దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ సీఈఓ రవీంద్రన్‌కు ఈడీ తాజాగా గట్టి షాకిచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Byju's CEO Raveendran: కోవిడ్‌ సమయంలో ఎడ్యూకేషన్‌ రంగంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్‌ సంస్థ ప్రస్తుతం దివాలా దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ సీఈఓ రవీంద్రన్‌కు ఈడీ తాజాగా గట్టి షాకిచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కరోనా సమయంలో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతింటే.. ఒక్క ఆన్‌టైన్‌ ఎడ్యూకేషన్‌ మాత్రం భారీ డిమాండ్‌ను చూసింది. స్కూల్స్‌, కాలేజీలు మూతపడటంతో.. పిల్లలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆ టైమ్‌లో ఆన్‌లైన్‌లో పిల్లలకు కోర్సులు నేర్పిస్తామంటూ.. ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ ప్రచారం హోరెత్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విపరీతంగా ఆకర్షితులయ్యారు. అంతే.. ఎడ్యూకేషన్‌ రంగంలో బైజూస్‌ పేరు మారుమోగిపోయింది. భారీ డిమాండ్‌తో ఆ సంస్థ అదే స్థాయిలో నియామకాలు చేపట్టి.. పెద్ద ఎత్తున మ్యాన్‌పవర్‌ను నియమించుకుంది.

కానీ, కరోనా తర్వాత మానవ జీవనం సాధారణ స్థితికి రావడం, స్కూల్స్‌, కాలేజీలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో ఆన్‌లైన్‌ విద్యకు విద్యార్థులు దూరమయ్యారు. అక్కడి నుంచి బైజూస్‌కు కష్టాలు మొదలయ్యాయి. దానికి తోడు ఆ సంస్థ సీఈఓ రవీంద్ర తీసుకున్న నిర్ణయాలు కూడా సంస్థను అప్పుల్లోకి నెట్టేసింది. చాలా కాలంగా అప్పుల్లో నడుస్తున్న బైజూస్‌.. దివాళా తీసే స్థితికి చేరింది. ఈ క్రమంలోనే ఈడీ తాజాగా ఆ సంస్థ సీఈఓ రవీంద్రన్‌ దేశం విడిచివెళ్లకుండా లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయాలని బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ను కోరింది.

గతేడాది ఈడీ బెంగళూరులోని బైజూస్‌ కార్యాలయాలతో పాటు రవీంద్రన్‌ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ఆన్‌ ఇంటిమేషన్‌ లుకౌట్‌ సర్క్యులర్‌ అమల్లో ఉంది. తాజాగా పూర్తి స్థాయి లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేయడంతో ఒకపై రవీంద్రన్‌ భారత్‌ విడిచి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో.. రవీంద్రన్‌ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ఈడీ లుకౌట్‌ నోటీసులతో ఇబ్బంది పెడుతున్న సమయంలోనే రవీంద్రన్‌కు తోటీ వాటాదారులు షాకిచ్చారు. ఆయనను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు కొంతమంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్‌ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 23న ఈ మీటింగ్‌ జరగనుంది. దీనిపై బైజూస్‌ సంస్థ కోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. మీటింగ్‌ నిర్వహణకు కర్ణాటక హైకోర్టు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Show comments