PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఖాతాలోని తప్పులను ఈజీగా సరిచేసుకోవచ్చు

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఖాతాలో వివరాల్లో తప్పులుంటే సులభంగా ఆన్ లైన్ లోనే సరిచేసుకోవచ్చు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఖాతాలో వివరాల్లో తప్పులుంటే సులభంగా ఆన్ లైన్ లోనే సరిచేసుకోవచ్చు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని సదరు ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంటాయి. ఈ డబ్బు ఆ ఉద్యోగి భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది. పీఎఫ్ ఖాతా ఉంటే గృహ నిర్మాణం, పిల్లల చదువు, వివాహం, అనారోగ్యం, ఫైనల్‌ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్‌మెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్‌ వంటి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు కోసం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అయితే ఇటీవల ఈపీఎఫ్ ఓ తన చందాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కొత్త రూల్స్ ను తీసుకొస్తుంది. ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులు సమర్పించిన వివరాల్లో ఏవైన తప్పులుంటే ఈజీగా మార్పులు చేసుకోవచ్చు.

ఇటీవల ఈపీఎఫ్ ఓ ఆన్ లైన్ క్లెయిమ్స్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. పీఎఫ్ ఖాతాదారులు ఆన్ లైన్ లో క్లెయిమ్ చేసుకునే వారు దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. తాజాగా పీఎఫ్ ఖాతాలో చందాదారుడి వివరాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుడి వివరాల్లో తప్పులు దొర్లితే ఈజీగా సవరించుకునేలా నిబంధనలను సడలించింది. ఖాతాదారుడి వివరాలు అన్నీ సరిగా ఉంటేనే క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు. అయితే ఒక్కోసారి పేరు, ఇతర వివరాలలో తప్పులు దొర్లుతాయి. గతంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది.

చందాదారులు తమ సంస్థ యజమాని సంతకం చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫాం సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్ లైన్ లో చాలా ఈజీగా మార్పులు చేసుకోవచ్చు.దీనికోసం ఈపీఎఫ్ఓ ఒక సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను విడుదల చేసింది. దీనిద్వారా మన పీఎఫ్ ఖాతాలో సుమారు 11 రకాల మార్పులను ఆన్ లైన్ లో చాలా సులభం చేసుకోవచ్చు. సభ్యుడి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి / తల్లి పేరు, రిలేషన్, వైవాహిక స్థితి, చేరిన తేదీ, ఉద్యోగం మానివేయడానికి కారణం, మానివేసిన తేదీ, జాతీయత, ఆధార్ కార్డు తదితర వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్‌ ను సందర్శించి ఆన్ లైన్ లోనే వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు.

Show comments