Anant Ambani: అంబానీ ఇంట పెళ్లి.. అక్కడ ఆఫీసులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఎక్కడంటే..!

Anant Ambani Radhika Marriage-Work From Home: ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంటి నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ వివాహం జూలై 12న అనగా ఇవాళ జరగనుంది. ఈక్రమంలో కొన్ని ఆఫీసులు.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చాయి. ఆ వివరాలు..

Anant Ambani Radhika Marriage-Work From Home: ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇంటి నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ వివాహం జూలై 12న అనగా ఇవాళ జరగనుంది. ఈక్రమంలో కొన్ని ఆఫీసులు.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చాయి. ఆ వివరాలు..

ఆసియా కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు.. రిలయన్స్‌ సంస్థల అధిపతి ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. ఆయన చిన్న కుమారుడు అనంత్‌​ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం అంగరంగం వైభవంగా జరుగుతోంది. నేడు అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్‌, రాధికలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. భారీ ఖర్చుతో.. ఏంతో వైభవంగా జరిగే ఈ వేడుకకు.. దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరుకానున్నారు. దాంతో ముంబై నగరం బిజీబిజీగా మారింది. అనంత్‌ పెళ్లి నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధానిలో హోటళ్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఒక్క రోజుకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయంటే.. రద్దీ ఎంత విపరీతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం నేపథ్యంలో.. ముంబై నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు, పరిమితులు కొనసాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లోని అనేక కార్యాలయాలు జూలై 15 వరకు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. ముంబై నగరంలో రద్దీ తగ్గే వరకు అనగా జూలై 15 వరకు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. జూలై 12న అనగా శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్-రాధికల వివాహం జరుగుతున్న సందర్భంగా.. సదరు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

వివాహం తర్వాత.. జూలై 13న శుభ ఆశీర్వాదం, జూలై 14న మంగళ్ ఉత్సవ్ జరుగుతాయని తెలుస్తోంది. అనంత్‌-రాధికల వివహానికి మన దేశం నుంచే కాక.. ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ అతిథుల కోసం ఇప్పటికే ఐటీసీ, ది లలిత్, తాజ్ వంటి ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. దాంతో ముంబైలో హోటల్ ఆక్యుపెన్సీ, ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బీకేసీలోని లగ్జరీ హోటళ్లు ఒక్క రాత్రికి.. గదికి రూ.లక్ష వరకు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ముంబైలోని హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయ్‌లో వారి వెబ్‌సైట్‌ల ప్రకారం జూలై 10-14 వరకు గదులు అందుబాటులో లేవని తెలిస్తుంది.

ఇక అనంత్ అంబానీ వివాహ వేడుకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిమ్ కర్దర్శియాన్, ఖోలీ కర్దాషియాన్, యూకే మాజీ పీఎం బోరిస్ జాన్సన్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ టైక్లెట్, ప్రెట్ ఎ మ్యాంగర్ సీఈవో పనో క్రిస్టౌ తదితరులు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ జానపద గాయకుడు మామే ఖాన్‌కు ఆహ్వానం అందడమే కాకుండా జూలై 12న జరిగే వివాహ వేడుకలో కూడా పాల్గొననున్నారు. ఈ వార్తను ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

ఇదిలావుండగా అనంత్-రాధిక వివాహానికి ముందు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే మంగళవారం తమ నివాసం యాంటిలియాలో హల్దీ వేడుకను నిర్వహించారు. జూలై 5న కుటుంబం సంగీత్‌ వేడుకను నిర్వహించింది. దీనికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. గ్లోబల్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కూడా ఈ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు. ఇక ఈ పెళ్లికి బాలీవుడ్‌ తారా లోకం తరలి వెళ్తుంది. మన దగ్గర నుంచి రామ్‌చరణ్‌ దంపతులు హాజరవుతున్న సంగతి తెలిసిందే.

Show comments