కియా మోడల్ కార్లలో సాంకేతిక లోపం.. రీకాల్ ప్రకటించిన కంపెనీ..

Kia Motors Recalled EV6 Cars In India: పలు ఆటోమొబైల్ కంపెనీలు అప్పుడప్పుడూ రీకాల్ ప్రకటిస్తుంటాయి. కార్లలో సాంకేతిక సమస్యలు ఉంటే కస్టమర్ల నుంచి రీకాల్ ప్రకటిస్తాయి. తాజాగా ప్రముఖ కొరియన్ కార్ల తయారీ కంపెనీ ఆ మోడల్ కార్లలో సాంకేతిక లోపం ఉందని రీకాల్ ప్రకటించింది.

Kia Motors Recalled EV6 Cars In India: పలు ఆటోమొబైల్ కంపెనీలు అప్పుడప్పుడూ రీకాల్ ప్రకటిస్తుంటాయి. కార్లలో సాంకేతిక సమస్యలు ఉంటే కస్టమర్ల నుంచి రీకాల్ ప్రకటిస్తాయి. తాజాగా ప్రముఖ కొరియన్ కార్ల తయారీ కంపెనీ ఆ మోడల్ కార్లలో సాంకేతిక లోపం ఉందని రీకాల్ ప్రకటించింది.

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ 1138 ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కియా ఇండియా ఆటోమొబైల్ కంపెనీ స్వచ్చందంగా రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. కియా ఈవీ6 మోడల్ కార్లలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)లో సంభావ్య లోపం ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. దీని వల్ల 12 వోల్ట్స్ ఆగ్జిలరీ బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుందని అందుకే రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రీకాల్ కి సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని.. త్వరలోనే లోపం ఉన్న వాహనాల యజమానులను సంప్రదిస్తామని కియా కంపెనీ తెలిపింది. సంప్రదించిన తర్వాత అపాయింట్మెంట్ షెడ్యూల్ కోసం వాహన యజమానులు కియా డీలర్స్ ని సంప్రదించాల్సి వస్తుందని కంపెనీ వెల్లడించింది.

గత నెలలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ కూడా ఐయోనిక్ 5 మోడల్స్ పై రీకాల్ ప్రకటించింది. అందులో కూడా కియా మోటార్స్ లానే ఐసీసీయూలో లోపం ఉంది. తాజాగా కియా కంపెనీ కూడా ఈవీ6 ఎలక్ట్రిక్ వాహనాలపై రీకాల్ ప్రకటించింది. 1138 కార్లను మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన ఈవీ6 మోడల్ కార్లలో మాత్రమే ఈ లోపం తలెత్తే అవకాశం ఉందని.. అందుకే వాటిని మాత్రమే రీకాల్ చేస్తున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఆ లోపాన్ని సరిచేయడానికి రీకాల్ చేస్తున్నామని.. అందుకోసం సాఫ్ట్ వేర్ ని అప్డేట్ చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే దీని కోసం కస్టమర్లు ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉచితంగానే లోపాన్ని సరిచేసి ఇస్తామని.. చేసే ముందు కష్టమర్ కి సందేశాన్ని పంపిస్తామని పేర్కొంది.

ఇక కియా ఈవీ6 విషయానికొస్తే.. 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. సింగిల్ మోటార్ రేర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ రెండు వెర్షన్స్ తో వస్తుంది. సింగిల్ మోటార్ వెర్షన్ 229 హార్స్ పవర్, 350 ఎన్ఎం టార్క్ తో రాగా.. డ్యూయల్ మోటార్ వెర్షన్ 325 హార్స్ పవర్, 605 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం ఈ కియా ఈవీ6 కారు 708 కి.మీ. రేంజ్ ని ఇస్తుంది. ఇది బీఎండబ్ల్యూ ఐఎక్స్1, వోల్వో ఎక్స్సీ 40 రీఛార్జ్, వోల్వో సీ40 రీఛార్జ్, కొత్తగా లాంఛ్ అయిన మెర్సిడిస్ ఈక్యూఏ వంటి ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీలతో పోటీ పడుతుంది.అంతేకాదు సొంత దేశమైన సౌత్ కొరియాకి చెందిన హ్యుందాయ్ అయోనిక్ 5తో కూడా పోటీ పడుతుంది. ఇక దీని ఎక్స్ షోరూం ధర రూ. 64.11 లక్షల నుంచి రూ. 69.35 లక్షల మధ్యలో ఉంది. 

Show comments