ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం స్టార్ట్ చేస్తే.. మీ పిల్లలు లైఫ్ లాంగ్ సేఫ్!

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు పేరిట దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కొత్తగా ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చింది. మరీ, ఇంతకీ ఆ పథకం ఏమిటి? దాని ప్రయోజనలేమిటి, ఎలా ధరఖాస్తూ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలసుసుకుందాం.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు పేరిట దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కొత్తగా ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వచ్చింది. మరీ, ఇంతకీ ఆ పథకం ఏమిటి? దాని ప్రయోజనలేమిటి, ఎలా ధరఖాస్తూ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలసుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ సంపాదించిన కొంత మొత్తంలో ఎంతో కొంత పిల్లల పేరిట సేవింగ్స్ కింద పెట్టాలని ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందుగానే వివిధ పథకాల్లో పొదపు చేయాలని ప్రణాళికలు చేస్తుంటారు. మరీ అలాంటి వారి కోసం ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్ సమవేశంలో.. కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అనేది పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రయోజకరంగా ఉంటుంది.
మరీ ఆ పథకం పేరే NPS వాత్సల్య పథకం.అయితే ఈ పథకం కోసం ప్రతిఒ్కక తల్లిదండ్రులు పిల్లల పేరిట ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో అనుమతి ఇచ్చింది. మరీ, ఇంతకీ ఈ పథకం ప్రయోజనలేమిటి, ఎలా ధరఖాస్తూ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలసుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు పేరిట దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కొత్తగా NPS వాత్సల్య పథకం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ పథకంలో 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు అకౌంట్ తీసుకోవచ్చు. ఇకపోతే ఈ పథకం పన్ను ప్రయోజనాలతో పాటు.. దీర్ఘకాలిక పెట్టుబడి స్కీంగా బాగా ప్రాచుర్యం పొందింది. పైగా ఈ స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్ల కెరీర్ తో పాటు పెన్షన ప్లాన్ కూడా చేయవచ్చు. అయితే గత కొన్ని రోజుల వరకు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) తెరవడానికి వయస్సు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండేది. కానీ, ఇప్పటి నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు కూడా NPS వాత్సల్య యోజనలో ఖాతాను తెరవవచ్చు.

పైగా ఇందులో ఒక్కో చిన్నారికి ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది.  ఇక ఈ ఖాతా  పిల్లల వయస్సు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఇది తల్లిదండ్రులు, సంరక్షకులచే నిర్వహించబడుతుంది. అయితే పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే.. 75 సంవత్సరాల వయస్సు వరకు ఈ స్కీమ్ ను కొనసాగించవచ్చు. అలా కాకపోయినా.. నాన్-ఎన్‌పిఎస్‌గా మార్చుకోవచ్చు. అంటే ఫండ్ మొత్తాన్ని మరేదైనా పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇకపోతే తల్లిదండ్రులు పిల్లల పేరిట ఎన్‌పీఎస్ ఖాతాలో నెలకు కనీసం రూ.500 డిపాజిట్ చేయవచ్చు. అలాగే గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు ఈ పథకంలో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, అది ఏటా రూ.60,000 అవుతుంది. అది కాస్త పిల్లలకు 18 ఏళ్లు వచ్చేసరికి ఈ పెట్టుబడి రూ.10.80 లక్షలు అవుతుంది.

ఇప్పుడు దీనిపై 10% వార్షిక రాబడిని ఊహిస్తే.. లాభం రూ.19.47 లక్షలు అవుతుంది. ఇక ఇందులో దీర్ఘ కాలం కొనసాగినట్టు అయితే.. లాభాలు ఎక్కువగా ఉంటాయి. తమ పిల్లలు భవిష్యత్ లో ఏ ఉద్యోగం చేసినా.. వారి రిటైర్మెంట్ తరువాత కూడా ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు ఉండకూడదని తల్లితండ్రులు బాగా ఆలోచించి ఈ పథకాన్ని సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇక 18 ఏళ్లు నిండిన తర్వాత తన NPS వాత్సల్య ఖాతా నుండి మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలా కాకపోయినా 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ ద్వార ఈ మొత్తాన్ని పొందవచ్చు.

ఈ పథకంలో ఖాతా తెరవడం ఎలా?

  • NPS పెన్షన్ ఫండ్ అనేది రెగ్యులేటర్ PFRDA ద్వారా నిర్వహించబడే దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. పైగా ఇది చాలా సులభమైన ప్రక్రియ. మీరు ఈ ఖాతాను పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ వెబ్‌సైట్ ENPSలో తెరవవచ్చు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.
  • అలా తెరిచిన NPS వాత్సల్య ఖాతాను 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సాధారణ NPS ఖాతాగా మార్చుకోవచ్చు.
  • అంతేకాకుండా సాధారణ NPS ఖాతాకు మార్చకుండానే పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఇక ఈ ప్లాన్ పోర్టబిలిటీని అందిస్తుంది, అంటే ఉద్యోగం మారినప్పటికీ ఖాతా మారదు.
  • దీంతో పాటు ఈ ఖాతా చాలా కాలం పాటు కొనసాగితే పెద్ద మొత్తం వసూలు చేయబడుతుంది.
  • అలాగే పదవీ విరమణ సమయంలో, ఖాతాలో జమ చేసిన మొత్తంలో 60% విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఇక పదవీ విరమణ సమయంలో ఫండ్‌లో కొంత భాగాన్ని పన్ను రహితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
Show comments