P Venkatesh
BSNL New Recharge Plan: మొబైల్ యూజర్లకు అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. తక్కువ ధరలోనే డైలీ 3జీబీ డేటాను పొందొచ్చు. ఇంకా మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నది.
BSNL New Recharge Plan: మొబైల్ యూజర్లకు అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది బీఎస్ఎన్ఎల్. తక్కువ ధరలోనే డైలీ 3జీబీ డేటాను పొందొచ్చు. ఇంకా మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తున్నది.
P Venkatesh
ఇటీవల ప్రముఖ టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మొబైల్ యూజర్లు తక్కువ ధరకు రీచార్జ్ ప్లాన్స్ ను అందించే నెట్ వర్క్ ల వైపు చూస్తున్నారు. అన్ని నెట్ వర్క్ లతో పోలస్తే బీఎస్ఎన్ ఎల్ లో చౌకైన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ నెట్ వర్క్ కు లక్షలాది మంది మారారు. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తుంది బీఎస్ఎన్ ఎల్. అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తూ దూసుకెళ్తుంది. మీరు ఫోన్ ఎక్కువగా వాడుతుంటారా? డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే మీకు అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ లో రూ. 347తో రీచార్జ్ చేసుకుంటే డైలీ 3జీబీ డేటా పొందొచ్చు. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు.
బీఎస్ఎన్ఎల్ తాజాగా కొత్త రీచార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 347 తో రీచార్జ్ చేసుకుంటే 54 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా డైలీ 3జీబీ డేటాతో మొత్తం 165 జీబీ డేటా వస్తుంది. ఇంకా వీటికి అదనంగా.. హార్డీ గేమ్స్, గేమియం, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టిన్ పాడ్‌కాస్ట్ వంటి సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ రీచార్జ్ ప్లాన్ గా చెప్పొచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఆకర్షనీయమైన రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతూ జియో, ఎయిర్ టెల్ వంటి కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నుంచి చౌకైన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. యూజర్లకు మెరుగైన నెట్ వర్క్ ను అందించేందుకు 4జీని తీసుకొస్తున్నది. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది చివరికల్లా 5జీ నెట్ వర్క్ సైతం తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.