Bank ఖాతాదారులకు అలర్ట్.. ఈ ఫారమ్ నింపకపోతే అకౌంట్ నుంచి డబ్బులు కట్

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీరు బ్యాంక్ కు వెళ్లి వెంటనే ఈ ఫారమ్స్ ను నింపండి. లేదంటే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఇంతకీ ఆ ఫారమ్స్ ఏంటంటే?

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీరు బ్యాంక్ కు వెళ్లి వెంటనే ఈ ఫారమ్స్ ను నింపండి. లేదంటే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఇంతకీ ఆ ఫారమ్స్ ఏంటంటే?

బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండాలి. లేదంటే ఖాతా ఇనాక్టివ్ లోకి వెళ్తుంది. అదే విధంగా నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే బ్యాంక్ రూల్స్ ప్రకారం కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంటాయి బ్యాంకులు. కస్టమర్లు బ్యాంకులో తమ డబ్బును పొదుపు చేస్తుంటారు, ఫిక్స్ డ్ డిపాజిట్లు రూపంలో బ్యాంకుల్లో పెడుతుంటారు. ఈక్రమంలో మీరు మీ బ్యాంకులో ఎఫ్డీ చేసినట్లైతే మీకు బిగ్ అలర్ట్. మీరు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ ఫారమ్ ను పూరించి సబ్ మిట్ చేయండి. లేకపోతే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఇంతకీ ఏ ఫారమ్ అని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

డబ్బుపై కొంత రాబడి కోరుకునే వారు బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుంటారు. దీనిపై వచ్చే వడ్డీ సొమ్ముతో వారి అవసరాలను తీర్చుకుంటుంటారు. అయితే బ్యాంకులో ఎఫ్డీ చేసిన వారు ముందుగా బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్ ను పూరించి బ్యాంక్ అధికారులకు అందించండి. ఇలా చేయడం ద్వారా మీ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీపై ట్యాక్స్ ను విధించలేరు. మీరు ఎఫ్డీ చేసినట్లైతే బ్యాంకుకు వెళ్లి ఫారమ్ 15జీ,ఫారమ్ 15హెచ్ ని సమర్పించడి. ఈ ఫారమ్స్ ను సబ్ మిట్ చేయకపోతే వడ్డీ సొమ్ముపై టీడీఎస్ ను కట్ చేస్తారు. మరి ఈ రెండు రకాల ఫారమ్స్ ఎవరెవరికి అవసరం అవుతాయంటే.

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్‌లు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఫారమ్ 15జీ లేదా 15హెచ్ ని సమర్పించాలి. అయితే 60 సంవత్సరాల కంటే లోపు వయసు కలవారు ఫారమ్ 15జీ ద్వారా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారు ఫారమ్ 15హెచ్ ని ఉపయోగించి టీడీఎస్‌లో మినహాయింపును పొందవచ్చు. ఈ ఫారమ్స్ ను బ్యాంకులో సమర్పించడం ద్వారా వడ్డీపై టీడీఎస్ కట్ కాదు. మీ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీని పూర్తి మొత్తాన్ని అందుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 కంటే ఎక్కువ వడ్డీని పొందితే ఈ ఫారమ్స్ ఉపయోగపడతాయి.ల

Show comments