గుడ్ న్యూస్.. Bajaj CNG బైక్ డెలివరీలు ప్రారంభం

Bajaj CNG Bike: వాహనదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్ డెలివరీలను ప్రారంభించింది. ఫస్ట్ యూనిట్ డెలివరీని పూణేలో ప్రారంభించారు.

Bajaj CNG Bike: వాహనదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్ డెలివరీలను ప్రారంభించింది. ఫస్ట్ యూనిట్ డెలివరీని పూణేలో ప్రారంభించారు.

ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనానికి తెరలేపింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ. వరల్డ్ లోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ను రూపొందించి లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ తో నడిచిన ఆటోలను, కార్లను మాత్రమే చూశాం. బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్ ఆవిష్కరణతో ఇక టీవీలర్స్ కూడా సీఎన్జీతో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఇటీవలె వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125ను లాంఛ్ చేసింది బజాజ్ కంపెనీ. ఈ బైక్ అందుబాటులోకి రావడంతో వాహనదారులకు డబ్బులు ఆదాకానున్నాయి. పెట్రోల్ ధరలతో విసిగిపోతున్న వాహనదారులకు సీఎన్జీ బైక్ తో చక్కటి పరిష్కారం లభించినట్లైంది. ఇక ఈ బైక్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి.

దేశ వ్యాప్తంగా బజాజ్ సీఎన్జీ బైక్ ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సీఎన్జీ బైక్ ను లాంఛ్ చేసిన కొద్ది రోజులకే డెలివరీలు కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఫస్ట్ యూనిట్ డెలివరీని పూణేలో ప్రారంభించారు. ఈ డెలివరీలు పూణేలో మాత్రమే జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. బుకింగ్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆసక్తి కలిగిన కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. బజాజ్ ఆటో తన సిఎన్‌జీ బైకును డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

వీటి ధరలు వరుసగా రూ. 95000, రూ. 1.05 లక్షలు మరియు రూ. 1.10 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). బజాజ్ యొక్క ఫ్రీడమ్ 125 బైక్ లో సీఎన్‌జీ ట్యాంక్ మరియు పెట్రోల్ ట్యాంక్ రెండూ అందించారు. ఇందులో సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ రెండు కేజీలు, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా రెండు లీటర్లుగా ఉంది. పెట్రోల్ ద్వారా వంద కంటే ఎక్కువ కి.మీ.. సీఎన్‌జీ ద్వారా రెండు వందల కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. మొత్తం మీద ఈ బైక్ 330 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Show comments