కేంద్రం స్కీమ్ రూ. 20తో.. ఏకంగా రూ. 2 లక్షలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

PM Suraksha Bima Yojana: మీరు మంచి ప్రయోజనాలు అందించే బీమా పథకాల కోసం చూస్తున్నారా? అయితే కేంద్రం అందించే ఈ పథకంలో కేవలం 20 రూపాయలతో ఏకంగా రూ. 2 లక్షలు పొందొచ్చు.

PM Suraksha Bima Yojana: మీరు మంచి ప్రయోజనాలు అందించే బీమా పథకాల కోసం చూస్తున్నారా? అయితే కేంద్రం అందించే ఈ పథకంలో కేవలం 20 రూపాయలతో ఏకంగా రూ. 2 లక్షలు పొందొచ్చు.

దేశ ప్రజలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా స్కీమ్ లను ప్రవేశపెడుతున్నది. ఆర్థిక సాయం అందించే పథకాలు, బీమా పథకాలను కేంద్రం అమలు చేస్తున్నది. బీమా పథకాల ద్వారా భారీ ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ ప్రీమియంతోనే లక్షల్లో బీమా అందిస్తున్నది. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో ఊహించలేము. ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో వైకల్యం బారిన పడొచ్చు. లేదా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా చేయించుకున్నట్లైతే ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. బీమా సొమ్ము కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

ఈ రోజుల్లో కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. మరి మీరు కూడా బీమా పథకాల్లో చేరాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలు బెస్ట్ అని చెప్పొచ్చు. ఏడాదికి కేవలం 20 రూపాయల ప్రీమియం తోనే ఏకంగా 2 లక్షల బీమా పొందొచ్చు. మరి ఈ పథకాలకు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన విషయానికి వస్తే..

18 నుంచి 50 ఏళ్ల వయస్సు గలవారు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 436 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా సౌకర్యం పొందొచ్చు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, అతని నామినీకి రూ. 2 లక్షలు అందిస్తారు. ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం అవసరం. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల వైకల్యం ఏర్పడితే రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాంటే పాలసీదారుడికి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉండాలి. అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బుక్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు సమీప బ్యాంకు శాఖలో దరఖాస్తు చేయవచ్చు.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనవిషయానికి వస్తే..

కేంద్రం అందించే మరో బీమా పథకం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువ. వార్షికంగా రూ. 20 చెల్లిస్తే సరిపోతుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు గలవారు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో సులభంగా రూ. 2 లక్షల బీమా పొందవచ్చు. చందాదారుడు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. దీని కోసం బ్యాంక్ శాఖను సందర్శించి లేదా బ్యాంక్ మిత్ర సహాయంతో దరఖాస్తు చేయవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, ఖాతా నంబర్, ఫోటో వంటి పత్రాలు అవసరం. కేంద్రం అందించే ఈ రెండు బీమా పథకాల ద్వారా ఆర్థిక భద్రత పొందొచ్చు.

Show comments