Tirupathi Rao
Bigg Boss Telugu Season 8- Same Mistake In Contestant Selection: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం ఘనంగా ప్రారంభమైంది. అయితే తొలిరోజు గడవక ముందే షోకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి.
Bigg Boss Telugu Season 8- Same Mistake In Contestant Selection: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం ఘనంగా ప్రారంభమైంది. అయితే తొలిరోజు గడవక ముందే షోకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నాయి.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ని గ్రాండ్ గా లాంఛ్ చేశారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు కూడా గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్గెస్ట్ రియాలిటీ షో 8వ సీజన్ ని కూడా అట్టహాసంగా స్టార్ట్ చేసుకుంది. అయితే ఈసారి కూడా నిర్వాహకులు తెలుగు వారికి అదే అన్యాయం చేశారు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి బిగ్ బాస్ షోలో అదే తప్పు జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆ తప్పు ఏంటి? అసలు నిజంగానే అన్యాయం చేస్తున్నారా? షో స్టార్ట్ అయిన ఒక్కరోజు వ్యవధిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఆ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. ఈ విమర్శలు అన్నీ కంటెస్టెంట్స్ విషయంలోనే జరుగుతున్నాయి. అవును హౌస్ లోకి వెళ్లిన 14 మందికి సంబంధించే ఈ గొడవ. అయితే హౌస్ లోకి వెళ్లిన వారి గురించి కాదులెండి.. వాళ్లను హౌస్ లోకి పంపడంపైనే ఈ వాదనలు. అంటే హౌస్ లోకి మొదటి విడతలో మొత్తం 14 మందిని పంపించారు. ఆ 14 మందిలో ఉన్న తెలుగు వాళ్లు ఎంత మంది? అనేదే వాళ్ల ప్రశ్న. హౌస్ లోకి వెళ్లిన వాళ్లు.. యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, అభయ్ నవీన్, ప్రేరణ కంభం, ఆదిత్య ఓం, సోనియా, మధు నెక్కంటి అలియాస్ బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనికా, యూట్యూబర్ నబీల్ అఫ్రీదీ. వీరిలో కేవలం 8 మంది మాత్రమే తెలుగు వాళ్లు ఉన్నారు.
మిగిలిన వారిలో యష్మీ గౌడ, నిఖిల్ మలియక్కల్, పృథ్వీరాజ్, ప్రేరణ కంభం.. తెలుగులో సీరియల్స్ చేశారు. వీళ్లంతా కర్ణాటకకు చెందిన యాక్టర్స్. ఇంక ఆదిత్య ఓం తెలుగులో హీరోగా చేసినా కూడా ఆయనకు తెలుగు మాట్లాడటం ఇంకా రావడం లేదు. ఇంక నైనికా కూడా ఒడిశాకు చెందిన అమ్మాయి. పుట్టగానే తన తండ్రి అమ్మాయి అని దగ్గరకు తీసుకోలేదు అని ఆమెనే స్వయంగా చెప్పింది. ఇలా మొదటి విడతలో హౌస్ లోకి పంపిన 14 మందిలోనే ఆరుగురు వేరే భాష వాళ్లు ఉన్నారు అనేది ఇప్పుడు వస్తున్న విమర్శల సారాంశం. తెలుగు షోలో తెలుగు వాళ్లను ఎందుకు తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. నిజంగానే తెలుగులో హౌస్ లోకి పంపదగ్గ వాళ్లులేరా అని బాహటంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే షో మీద ఆసక్తి రావాలి అన్నా.. షోని చూడాలి అన్నా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఉండాలి. అందుకే వేరే భాష అయినా కూడా సెలబ్రిటీలను ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ల షో, టీఆర్పీ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.