iDreamPost
android-app
ios-app

సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్.. ఈసారి ప్రైజ్ మనీ రూ.కోటికి పైనే?

  • Published Sep 02, 2024 | 12:43 PM Updated Updated Sep 02, 2024 | 12:54 PM

Big Twist In Bigg Boss Telugu Season 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో చాలానే ట్విస్టులు ప్లాన్ చేశారు. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ప్రైజ్ మనీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈసారి ప్రైజ్ మనీ రూ.కోటి దాకా ఉండచ్చు అంటున్నారు.

Big Twist In Bigg Boss Telugu Season 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో చాలానే ట్విస్టులు ప్లాన్ చేశారు. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ప్రైజ్ మనీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈసారి ప్రైజ్ మనీ రూ.కోటి దాకా ఉండచ్చు అంటున్నారు.

  • Published Sep 02, 2024 | 12:43 PMUpdated Sep 02, 2024 | 12:54 PM
సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్.. ఈసారి ప్రైజ్ మనీ రూ.కోటికి పైనే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంఛింగ్ అవ్వడం.. హౌస్ లోకి కంటెస్టెంట్స్ వెళ్లడం చూశాం. వాళ్లు అప్పుడే టాస్కులు మాత్రమే కాదు.. గొడవలు కూడా స్టార్ట్ చేశారు. నాగ మణికంఠ- నిఖిల్ మలియక్కల్ మధ్య ఒక చిన్న ఆర్గుమెంట్ జరిగింది. అలాగే ఆర్జే శేఖర్ బాషా- ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల మధ్య అయితే.. గట్టిగానే గొడవ జరిగింది. నేను పశువునా అంటూ శేఖర్ బాషా కేకలు వేశాడు. అలాగే సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా ఆర్గుమెంట్ చేసింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో చాలానే ట్విస్టులు, టర్నులు ఉంటాయని తెలిసిందే. ఆ టర్నులకు సంబంధించి తొలిరోజే కొన్ని రివీల్ చేశారు. వాటిలో ప్రైజ్ మనీ గురించి కూడా ఒకటి. ఈసారి ప్రైజ్ మనీ కనీవినీ ఎరగనట్లు ఉంటుందని చెబుతున్నారు.

సర్ ప్రైజ్:

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో చాలానే సర్ ప్రైజ్ లు ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. రెమ్యునరేషన్ గురించి. ఎందుకంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ తెలుగు రెమ్యూనరేషన్ రూ.50 లక్షలు ఉంటుంది. అయితే ఆఖరి వారంలో కొందరికి సూట్ కేసులు పంపుతారు. అవి పోను మిగిలిన మొత్తాన్ని విన్నర్ కి ఇస్తారు. అయితే ఈసారి ప్రైజ్ మనీని ముందే రివీల్ చేశారు. అందరినీ యాక్షన్ రూమ్ లోకి పిలిచి.. అక్కడ ఒక పెద్ద బాక్స్ పెట్టి.. దానిని బ్లాస్ట్ చేసిమరీ ప్రజ్ మనీని రివీల్ చేశారు. కానీ, అందులో పెద్ద జీరో ఉంది. అందరూ కాసేపు కంగారు పడ్డారు. అదేంటి సున్నా ఉంది? ముందు వెనక ఏం లేదు అని. అందరూ వెళ్లేది ఆ ప్రైజ్ మనీ కోసమే. అలా సున్నా అనగానే అంతా కంగారు పడ్డారు. అక్కడే ఒక ట్విస్టును పెట్టారు.

big boss season 8 prize money

ప్రైజ్ మనీ కోటికి పేనే?:

ఈసారి ప్రైజ్ మనీ ట్విస్టు ఏంటంటే.. మనీ జీరోగానే ఉంటుంది. అయితే అది కేవలం జీరో దగ్గరే ఆగిపోదు. ఆ జీరో ఆఖరి వరకు పెరుగుతూ ఉంటుంది. అంటే వీళ్లు ఆడే ఆటలు, ఇచ్చే ఎంటర్ టైన్మెంట్, గెలిచే టాస్కులను బట్టి ఈ ప్రైజ్ మనీ పెరుగుతూ ఉంటుంది. దానికి ఆకాశమే హద్దు అని బిగ్ బాస్ ప్రకటించాడు. అంటే వాళ్లు దానిని ఎంత దూరం అయినా తీసుకెళ్లచ్చు. అలా ఈసారి ప్రైజ్ మనీ కోటి రూపాయలు కూడా దాటే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ, అంత వరకు వెళుతుందా? మధ్యలోనే ఆగిపోతుందా అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. కావాల్సినంత సమయం ఉంది కాబట్టి.. కనీసం రూ.50 లక్షలు వరకు అయితే తీసుకెళ్లచ్చు. మరి.. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రైజ్ మనీ ఎంత వరకు వెళ్లే ఛాన్స్ ఉంది అంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş