iDreamPost
android-app
ios-app

Naga Manikanta: స్టేజ్ పై తన భార్యను విలన్ చేసిన నాగ మణికంఠ.. కానీ, ఆమె బంగారం!

  • Published Sep 02, 2024 | 1:37 PM Updated Updated Sep 02, 2024 | 2:04 PM

Bigg Boss 8 Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పదవ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ అడుగు పెట్టాడు. అయితే వెళ్లే ముందు తన లైఫ్ స్టోరీ చెబుతూ తన భార్య గురించి కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. అయితే హౌస్ లోకి వెళ్లిన తరువాత తన భార్య గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు.

Bigg Boss 8 Naga Manikanta: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పదవ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ అడుగు పెట్టాడు. అయితే వెళ్లే ముందు తన లైఫ్ స్టోరీ చెబుతూ తన భార్య గురించి కూడా కొన్ని ఆరోపణలు చేశాడు. అయితే హౌస్ లోకి వెళ్లిన తరువాత తన భార్య గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు.

  • Published Sep 02, 2024 | 1:37 PMUpdated Sep 02, 2024 | 2:04 PM
Naga Manikanta: స్టేజ్ పై తన భార్యను విలన్ చేసిన నాగ మణికంఠ.. కానీ, ఆమె బంగారం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఆదివారం ప్రారంభమైన ఈ సీజన్ కు మరోసారి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించారు. 14 మంది కంటెస్టెంట్స్ ఈ సారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి భిన్నంగా జంటగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ వెళ్లారు. అందరు తమ గురించి సరద సరద విషయాలు చెప్పగా..నాగ మణికంఠ మాత్రం తన మాటలతో అందరిని ఎమోషనల్ చేశాడు. అంతేకాక తన భార్యతో జరిగిన విబేధాల గురించి కూడా స్టేజ్ పై చెప్పాడు. అయితే తరువాత హౌస్ లోపల ఆర్జే శేఖర్ బాషాతో తన భార్య గురించి మరికొన్ని విషయాలు తెలిపాడు. అతడు చెప్పిన మాటలు చేస్తే.నాగ మణికంఠ భార్య విలన్ కాదని పలువురు అంటున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బిగ్ బాస్ 8లోకి పదవ కంటెస్టెంట్ గా వెళ్లిన నాగ మణికంఠను వ్యక్తిగత జీవితంలో విధి ఓ రేంజ్ లో ఆడేసుకుంది. ఆయన పడిన కష్టాలు మరెవరు పడి ఉండరు. పుట్టిన రెండేళ్లకే తండ్రి చనిపోవడం, తల్లి వేరే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె రెండో భర్త మణికంఠ విషయంలో సరిగ్గా ఉండపోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే.. నాగ మణికంఠ తల్లి  2019లో క్యాన్సర్ కారణంగా మరణించింది. ఇలాంటి బాధలోఉండగానే..అతడి జాబ్ రావడం, ఆమెరికా వెళ్లడం జరిగింది. ఇదే సమయంలో మణికంఠకు వివాహం జరిగి.. ఓ పాప జన్మించింది. అయితే కొంతకాలం తరువాత నాగ మణికంఠ దంపతుల మధ్య విబేధాలు వచ్చి..విడిపోయారు. అతడు ఇండియాకు వచ్చి.. సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు సంపాదించాడు. ఇలా పాతికేళ్ల జీవితంలోనే అనేక కష్టనష్టాలను చూశాడు.

 నాగ మణికంఠ  తన లైఫ్ స్టోరీ గురించి బిగ్ బాస్ స్టేజీపై నాగార్జునతో షేర్ చేసుకున్నాడు. అనంతరం హౌస్ లోకి వెళ్లాక తన భార్య గురించి అర్థరాత్రి దాటిన తరువాత.. నాగ మణికంఠ తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. స్టేజీపై మణికంఠ చెప్పిన మాటలకు అతని భార్యపై అందరికీ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. అయితే.. మణికంఠ భార్య బంగారం. ఈ మాటను నాగమణికంఠే చెప్పాడు. లైవ్ ఎపిసోడ్ లో ఆర్జే శేఖర్ బాషాతో మాట్లాడుతూ.. తమ మధ్య పెద్ద గొడవలేం లేవని, అంతేకాక ఫోన్లు కూడా చేసుకుంటున్నామని తెలిపాడు. తన భార్య ప్రియనే బిగ్ హౌస్ లోకి పంపిందని, తాను హౌస్‌లోకి వెళ్లడానికి షాపింగ్ కావాల్సిన డబ్బులు కూడా ఆమెనే పంపిందని చెప్పుకొచ్చాడు.

తన భార్య ప్రియా చేసిన మిస్టేక్ లేదు.. తాను చేసిన మిస్టేక్ లేదని, ప్రియా చాలా మంచిదని నాగమణికంఠ అన్నాడు. ఇందంతా తన రాత అలా ఉందని, విధి ఆడిన నాటకమని నాగమణికంఠ చెప్పుకొచ్చాడు. ఇక తన భార్యా గురించి చెబుతూ… బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు తన వైఫ్‌కి కాల్ చేశాడట. ఆమె ఎంతో సపోర్టు, ధైర్యాన్ని ఇస్తూ హౌస్ లోకి వెళ్లేందుకు సాయం చేసింది. ఆమె చ్చిన డబ్బులు తీసుకుని షాపింగ్ చేశానని, అలానే హౌస్‌లో అడుగుపెట్టానని చెప్పుకొచ్చాడు నాగ మణికంఠ. మొత్తంగా అతని బిహేవియర్ చూస్తుంటే.. హౌస్‌లో అతను టార్గెట్ అవుతాడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి…మణికంఠ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇవి  కూడా చదవండి:

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet