Dharani
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ మీద నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అంతేకాక అతడి వద్ద నుంచి ట్రోఫీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే..
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ మీద నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అంతేకాక అతడి వద్ద నుంచి ట్రోఫీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే..
Dharani
ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. షో ఎంత ప్రశాంతంగా సాగిందో.. ఆ తర్వాత అంతకు మించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్, అమర్ అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాక.. మిగతా కంటెస్టెంట్ల కార్లు పగలగొట్టారు. అంతటితో ఆగక లేడీ కంటెస్టెంట్లతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆర్టీసీ బస్సుల మీద కూడా రాళ్లు రువ్వి నానా రచ్చ చేశారు.
దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అతడిని ఏ1గా చేర్చారు. ఇక కేసు నమోదు కావడంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఫోన్ కూడా స్విఛాఫ్ చేశాడని.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ వాటిని ఖండించాడు. తాను ఇంటి దగ్గరే ఉన్నానని తెలిపాడు.
ఆ విషయం పక్కకు పెడితే పల్లవి ప్రశాంత్ తీరుపై జనాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు అభిమానుల పేరుతో ఇంత రభస చేస్తుంటే ఏమాత్రం పట్టనట్లు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక పల్లవి ప్రశాంత్ నుంచి ట్రోఫీని వెనక్కి తీసుకోవాలనే కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకువస్తున్నారు. సమాజం గురించి ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ట్రోఫీ తీసుకోవడానికి అనర్హుడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట విన్నర్ ప్రశాంత్, రన్నరప్ అమర్ అభిమానులు గొడవపడ్డారు. దాంతో బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో బ్యాక్ గేట్ నుంచి బయటికి పంపించింది. గొడవ జరుగుతున్న వైపు రావొద్దని స్పష్టంగా చెప్పింది. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం పోలీసుల ఆదేశాలను, బిగ్‌బాస్ టీమ్ సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకున్నాడు. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలోనే గొడవకి ప్రశాంత్ కూడా కారణమంటూ పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఏ-1గా అతడి పేరును చేర్చారు.
అంతేకాక పల్లవి ప్రశాంత్ తన స్వగ్రామనికి వెళ్తున్న సమయంలో కూడా కొన్ని మీడియా చానెల్స్ ని పిలిచి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆ సయమంలో కూడా జరిగిన గొడవ గురించి స్పందిచలేదు. అభిమానులు ఇలా చేయడం సరైంది కాదు అని ఖండించలేదు. పైపెచ్చు.. అతడు సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలు కొన్ని వైరల్ కావడంతో నెటిజనులు అతడిపై మండి పడ్డారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఓవైపు నీ అభిమానులు.. రచ్చ రచ్చ చేసి.. దాడులు చేస్తుంటే.. నువ్వు వాటితో సంబంధం లేదన్నట్లు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి.. అమర్ కారు మీద దాడి చేసి.. అతడి భార్య, తల్లిని వేధించే ప్రయత్నం చేశారు.
అలానే లేడీ కంటెస్టెంట్లతో అసభ్యంగా ప్రవర్తించారు. నీ అభిమానులే చేశారా లేదా అన్నది పక్కకు పెడితే.. ఇలాంటి తీరును ఖండించాలి కదా. కానీ నీ నోటి నుంచి అలాంటి మాటలే రాలేదు. రైతు బిడ్డను అని చెప్పుకుంటావ్.. రైతలు ఎవరన్నా ఇలానే ఉంటారా.. కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు.. ఆడవారిని గౌరవిస్తారు. మరి పల్లవి ప్రశాంత్ ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.
అంతేకాక కేసులు నమోదయ్యాయి అనగానే పరారీలోకి వెళ్లాడు. ధైర్యంగా ముందుకు వచ్చి.. అభిమానులు తరఫున క్షమాపణలు చెప్తే బాగుండేది. అలా చేయకుండా రైతు బిడ్డను అవమానిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు.. ఇప్పటి వరకు ఆరు సీజన్ లు గడిచాయి. ఏ విన్నర్ కూడా ఇలా అతిగా చేయలేదు అంటున్నారు. కానీ ప్రశాంత్ పోలీసులు, బిగ్ బాస్ యాజమాన్యం వద్దని చెప్తున్నా వినకుండా.. నేనేం దొంగతనం చేయలేదు.. గెలిచినా.. ఎందుకు దొడ్డి దారి గుండా పోవాలంటూ గొడవలు జరిగే ప్రాంతానికి వెళ్లి దాన్ని మరింత పెంచాడు తప్పితే.. పరిస్థితి అర్ధం చేసుకుని.. ముందుకు వెళ్లలేదు. దాంతో గొడవ మరింత ముదిరింది అని విమర్శిస్తున్నారు నెటిజనులు.
Pallavi Prashanth
Who the F is this guy bro 😭😭😭#BiggBossTelugu7 pic.twitter.com/1qCQZyMU7b— VIGHNESH🔴 (@vigz_manutd) December 19, 2023
Please @hydcitypolice please arrest Pallavi Prashanth. It is clearly his arranged mob and PR team.
I thought it was only limited to bus damage but now they are also harassing women 😔. Just take a look how those luchas are forcing her.
Shame on this PP fanbase.#BiggBossTelugu7 pic.twitter.com/xwY8KGEKx0
— VIGHNESH🔴 (@vigz_manutd) December 20, 2023
కామన్ మ్యాన్, రైతు బిడ్డ అని గెలిపించిన జనాలే.. ఇప్పుడు అతడి వైఖరిని తప్పు పడుతున్నారు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేని వ్యక్తి బిగ్ బాస్ టైటిల్ కి అనర్హుడు.. అతడి వద్ద నుంచి దాన్ని తీసుకుని.. రన్నరప్ అమర్ కి ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకు వస్తున్నారు. దీనిపై బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన లేదు. అసలు ఇలా టైటిల్ ని వెనక్కి తీసుకోవడం సాధ్యమో కాదో తెలియదు కానీ.. ఈ డిమాండ్ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై మీరేం అంటారు.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Orey 😂 😂 😂 #PallaviPrashanth pic.twitter.com/J74fSBDFTr
— Indian Cinema Hub (@IndianCinemaHub) December 18, 2023
Take necessary actions on this guy he didn’t even respect police, law and order @TelanganaDGP @tsrtcmdoffice @TelanganaCMO @TelanganaCOPs#BiggBossTelugu7 #PallaviPrashanth
pic.twitter.com/kFmF932BdF— Surya (@Suryaswaero3) December 19, 2023