Somesekhar
తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే? బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. ఆ వివరాలు..
తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే? బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. ఆ వివరాలు..
Somesekhar
పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఎంతో మంది సెలబ్రిటీలను వెనక్కినెట్టి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు ఈ రైతుబిడ్డ. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. ఎవ్వరూ ఊహించని విధంగా టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. ఆడియన్స్ లో కూర్చున్న స్థానం నుంచి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు. అతడు ఈ రియాలిటీ షోలో పాల్గొనే నాటికి.. అతడెవరో కూడా చాలా మందికి తెలీదు. అలాంటి ఓ కామన్ మ్యాన్ ఇలాంటి బిగ్ రియాలిటీ షో టైటిల్ గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే? బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పల్లవి ప్రశాంత్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఓ సాధారణ రైతుబిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి.. మహామహులైన సెలబ్రిటీలను తలదన్ని బిగ్ బాస్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. అతడు పెరిగిన వాతావరణం, బిగ్ బాస్ ఈ రెండు వేరే ప్రపంచం. అయినా కానీ భయపడకుండా.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, తన ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని చూసినా.. వెనకాడకుండా అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ టైటిల్ కొట్టి చూపించాడు ఈ రైతుబిడ్డ. ఇక్కడి వరకు మనందరికి తెలిసిన విషయమే. ఇక తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. పల్లవి ప్రశాంత్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? అంటూ ఆరా తీయ్యడం మెుదలుపెట్టారు అభిమానులు.
అసలు విషయం ఏంటంటే? గతంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు ఆ ఇంటర్వ్యూలో తమపై వచ్చిన ఆరోపణలు 60 ఎకరాల పొలం, బంగ్లా, నాలుగు కార్లు ఉన్నాయని వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అబద్దాలని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటుగా పల్లవి ప్రశాంత్ పెళ్లి గురించి కూడా ఈ సందర్భంగా హింట్ ఇచ్చారు. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. ఇక ఇప్పుడు అతడు బిగ్ బాస్ విన్నర్ గా బయటికి రావడంతో.. త్వరలోనే ప్రశాంత్ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై ఇంతవరకు ప్రశాంత్ తల్లిదండ్రులు గానీ, ప్రశాంత్ గానీ క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. సంబంధాలు చూసే పనిలో ఉన్నారట ప్రశాంత్ తల్లిదండ్రులు. తమ చుట్టాల అమ్మాయినే అతడికిచ్చి వివాహం చేయడానికి చూస్తున్నట్లు సమాచారం. కానీ ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరావట్లేదు. ప్రస్తుతం మనోడు సెలబ్రిటీ కావడంతో.. సంబంధాలు బాగానే వస్తాయి. అయితే తల్లిదండ్రుల నిర్ణయం ప్రకారం ప్రశాంత్ వెంటనే పెళ్లి చేసుకుంటాడా? లేక బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో కెరీర్ పై ఫోకస్ పెడతాడా? చూడాలి మరి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.