iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Winner గా పల్లవి ప్రశాంత్.. అతడి గెలుపుకు 5 కారణాలు.. 4 వ కారణమే విజేతని చేసింది

  • Published Dec 18, 2023 | 1:59 PMUpdated Dec 18, 2023 | 2:09 PM

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. విజేతగా బయటకు వచ్చాడు. మరి అతడి గెలుపుకు గల కారణాలు ఏంటంటే..

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. విజేతగా బయటకు వచ్చాడు. మరి అతడి గెలుపుకు గల కారణాలు ఏంటంటే..

  • Published Dec 18, 2023 | 1:59 PMUpdated Dec 18, 2023 | 2:09 PM
Bigg Boss 7 Winner గా పల్లవి ప్రశాంత్.. అతడి గెలుపుకు 5 కారణాలు.. 4 వ కారణమే విజేతని చేసింది

బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో నెగ్గుకురావడం అంటే మాములు విషయం కాదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ధ్రుడంగా ఉండాలి. ఈ గేమ్ షోలో ముఖ్యంగా పరీక్షించేది భావోద్వేగాలను. మనల్ని మనం ఎంత కంట్రోల్ గా ఉంచుకున్నా ఏదో సమయంలో బయటపడతాం. అలా పడకుండా నిగ్రహంగా ఉన్న వారే విజేతగా నిలుస్తారు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కామన్ మ్యాన్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. అసామాన్య రీతిలో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అసలు బిగ్ బాస్ హౌజ్ లో కామన్ మ్యాన్ ఇన్ని వారాలు కొనసాగడమే గ్రేట్ అంటే.. పల్లవి ప్రశాంత్ ఏకంగా విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరి పల్లవి ప్రశాంత్ విజయానికి దోహదం చేసిన అంశాలు ఏంటి అంటే..

కలిసి వచ్చిన రైతు బిడ్డ ట్యాగ్..

హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వడమే రైతు గెటప్ లో..భుజం మీద వడ్ల బస్తా వేసుకుని వచ్చి.. తాను మూలాలను మర్చిపోనని చెప్పకనే చెప్పాడు పల్లవి ప్రశాంత్. మొదటి రోజు నుంచే రైతుబిడ్డ అనే ట్యాగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హౌస్ లో నిత్యం తాను ఒక రైతుబిడ్డనని, తాను విన్నర్ అయితే రైతులకు సహాయం చేస్తానని పదేపదే చెప్పడంతో కొందరు ఆడియన్స్ ప్రశాంత్ కి కనెక్ట్ అయ్యారు.

శివాజీ డైరెక్షన్ లో..

ఇక హౌస్ లో ప్రశాంత్ కి పెద్ద ప్లస్ పాయింట్ శివాజీ అని చెప్పవచ్చు. సీనియర్ నటుడు శివాజీ గైడెన్స్ లో ప్రశాంత్ గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. శివాజీ ఇచ్చే సలహాలు పాటిస్తూనే.. తన స్ట్రాటజీలతో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. బలమైన గాయాలైనా ఏ రోజు వెనక్కి తగ్గలేదు. శివాజీ చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఆయన అభిమానులు కూడా పల్లవి ప్రశాంత్‌ను ఇష్టపడటం మొదలుపెట్టారు.

టాస్క్ ల్లో ప్రాణం పెట్టాడు..

రైతు బిడ్డ పైగా ముందు నుంచి కష్టపడే తత్వం ఉండటం పల్లవి ప్రశాంత్ కు కలిసి వచ్చింది. అందుకే ఎలాంటి టాస్క్ అయినా సరే.. కష్టమనుకోకుండా నూటికి నూరు శాతం ప్రయత్నిస్తూ.. మిగతా వాళ్లకి గట్టి పోటీ ఇచ్చాడు. టాస్క్ ల్లో ప్రశాంత్ ని కొట్టే వాళ్లు లేరు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు. బలమైన గాయాలైనా సరే వాటిని లెక్క చేయలేదు.

గేమ్‌పై ఫోకస్..

గేమ్స్, టాస్క్ ల్లో ఫిసికల్‌గా, మెంటల్‌గా ఎంత బాధపడ్డా.. పోరాడి కెప్టెన్ అయ్యాడు, పట్టుదలతో ఆడాలన్నా, గేమ్‌పై ఫోకస్ పెట్టాలన్న ప్రశాంత్ తర్వాతే ఎవరైనా.. గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎటూ డైవర్ట్ అవ్వకుండా ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో తెలుసు అంటూ అనేక సార్లు కంటెస్టెంట్లే ప్రశాంత్ ని పొగిడారు. అదే విషయాన్ని ప్రేక్షకులు కూడా నమ్మారు. అలానే గేమ్ పై ఫోకస్ కోల్పోకుండా ఆడుతూ.. పవర్ అస్త్రా గెలుచుకున్నాడు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించాడు.

రతికతో బ్రేకప్.. ప్రశాంత్ పై సింపథీ..

ఇక హౌస్ లో ప్రశాంత్ కి కలిసి వచ్చిన మరో అంశం ఏంటంటే.. వచ్చి రాగానే రతికతో ప్రేమాయణం నడపడం. ముందు దీన్ని చూసిన వారంతా రైతు బిడ్డను విమర్శించారు. కానీ ఎప్పుడైతే.. రతిక నుంచి ఎదురుదెబ్బ తగిలిందో.. దాన్ని ప్రేక్షకులు కూడా తీసుకోలేపోయారు. ప్రశాంత్ మీద సింపతీ క్రియేట్ అయ్యింది. ఇక ఓడిపోయిన సందర్భంలో ఏడ్చేవాడు. ముందు అందరూ సింపతీ గేమ్ అనుకున్నారు. కానీ చివరకు ప్రశాంత్ సున్నిత మనసును అర్థం చేసుకున్నారు ప్రేక్షకులు. ఇక చివరి వారంలో ఫన్ టాస్క్ లో అమర్ ప్రవర్తన కూడా ప్రశాంత్ పై అందరికి సానుభూతి క్రియేట్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి