iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి యంగ్‌ హీరో.. నామినేట్‌ చేయవద్దంటూ ముందే రిక్వెస్ట్‌

  • Published Sep 04, 2023 | 9:53 AM Updated Updated Sep 04, 2023 | 9:53 AM
  • Published Sep 04, 2023 | 9:53 AMUpdated Sep 04, 2023 | 9:53 AM
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి యంగ్‌ హీరో.. నామినేట్‌ చేయవద్దంటూ ముందే రిక్వెస్ట్‌

సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపించే మాట.. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను అని. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. డాక్టర్‌ డిగ్రీ అందుకుని.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 7లోకి కంటెస్టెంగా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్‌ కృష్ణ కూడా పైన చెప్పుకున్న కోవలోకే వస్తాడు. చిన్నప్పటి నుంచి సినిమాలటే గౌతమ్‌ కృష్ణకు పిచ్చి. తల్లిదండ్రులకు అదే విషయం చెప్పాడు. కానీ వారు మాత్రం.. ముందు చదువు పూర్తి చేయ్‌.. ఆ తర్వాతే సినిమాలు అన్నారు. తల్లిదండ్రులు చెప్పింది కూడా తన భవిష్యత్తు గురించే అని అర్థం చేసుకున్న గౌతమ్‌ కృష్ణ.. వారి కోరిక మేరకు డాక్టర్‌ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల మీద మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తాజాగా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు.

బిగ్‌బాస్‌ 7లో.. మిగతా సీజన్‌లా మాదిరే.. ఈ సారి కూడా హౌస్‌లోకి సీరియల్‌ నటులు, యూట్యూబర్లతో పాటు.. సినిమా ఇండస్ట్రీ నుంచి శివాజీ, గౌతమ్‌ కృష్ణలకు అవకాశం చ్చారు. ఇక యంగ్ హీరో గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్‌లో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక హోస్ట్‌ నాగార్జునతో మాట్లాడుతూ.. సినిమాల మీద తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చాడు గౌతమ్‌ కృష్ణ. అతడి పరిచయం అయ్యాక నాగార్జున.. హౌస్‌లో డాక్టర్‌ అవసరం ఎంతైనా ఉందని అన్నాడు. అయితే తనను చివరి వరకు నామినేట్‌ చేయవద్దని కంటెస్టెంట్లకు చెప్పండంటూ సరదాగా కోరాడు గౌతమ్‌.

గౌతమ్‌ కృష్ణ ప్రొఫైల్‌..

‘ఆకాశవీధుల్లో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు గౌతమ్ కృష్ణ. ఈ సినిమాలో గౌతమ్‌ కృష్ణ పక్కన.. హీరోయిన్‌గా పూజిత పొన్నాడ నటించింది. ఇందులో కొన్ని బోల్డ్‌ సీన్లు కూడా ఉన్నాయి. ఇక గౌతమ్‌ కృష్ణ ఈ సినిమాకు హీరో మాత్రమే కాక.. డైరెక్షన్ కూడా చేశాడు గౌతమ్. కానీ తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు గౌతమ్.తాజాగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు గౌతమ్‌ కృష్ణ. మరి హౌజ్‌లో ఎంత కాలం రాణించగలుగుతాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna)