YS జగన్ గొప్ప మనసు.. వరద బాధితులకు కోటి సాయం!

YS Jagan Announces 1 Crore For Flood Relief: ప్రజలకు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి అండగా నిలుస్తుంటారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి. మరోమారు ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.

YS Jagan Announces 1 Crore For Flood Relief: ప్రజలకు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి అండగా నిలుస్తుంటారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి. మరోమారు ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు.

ప్రజలకు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి అండగా నిలుస్తుంటారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్​మోహన్​రెడ్డి. జనాలు కష్టాల్లో ఉన్నారంటే ఆయన తట్టుకోలేరు. వెంటనే వాళ్లకు కావాల్సిన సాయాన్ని అందిస్తుంటారు. ఏ ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటారు. అలాంటి జగన్ మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు. వరద బాధితులకు ఆయన భారీగా విరాళం ప్రకటించారు. కోటి రూపాయలను ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరదలు ముంచెత్తిన ప్రాంతాలను ఆయన సందర్శించారు. అక్కడి బాధితుల్ని పరామర్శించారు.

భారీ వరదల కారణంగా విజయవాడలో తలెత్తిన పరిస్థితిని వైఎస్ జగన్ సమీక్షించారు. బాధితులతో చాలా సేపు మాట్లాడిన ఆయన.. వారికి అందుతున్న సహాయక చర్యల మీద ఆరా తీశారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. అక్కడే విరాళ ప్రకటన చేశారు. అలాగే వరద సాయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేపట్టడం లేదని జగన్ సీరియస్ అయ్యారు. ఆహారం, మంచి నీరు దొరక్క బాధితులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రచార ఆర్భాటాలే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ సర్కారును ఆయన దుయ్యబట్టారు.

వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా వాళ్లకు మందులు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. బాధితుల కష్టాన్ని స్వయంగా చూశానని.. వాళ్లను ఆదుకోవడంలో గవర్నమెంట్ విఫలమైందన్నారు. వరద బాధితుల కోసం కోసం కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని చెప్పిన జగన్.. ఏ రూపంలో దాన్ని అందివ్వాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జగన్​తో సమావేశమైన నాయకుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. మాజీ మంత్రులు మెరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అనిల్ కుమార్ కూడా ఈ మీటింగ్​లో పాల్గొన్నారు.

Show comments