iDreamPost
android-app
ios-app

చనిపోతూ డబ్బున్న అమ్మాయిని.. నీచుడి నుంచి కాపాడిన మంచోడు

  • Published Mar 04, 2024 | 11:43 AM Updated Updated Mar 04, 2024 | 11:43 AM

కొంతమంది పుట్టుక, చావులు మరొకరి కోసమే అన్నట్టు ఉంటాయి. తెలిసి, తెలియక కొందరి జీవితాలు మరి కొందరి జీవితాలను నిలబెడతాయి. ఓ యువకుడి మరణం.. నీచుడి వలలో చిక్కుకున్న డబ్బున్న అమ్మాయిని రక్షించడానికి ఉపయోగపడింది.

కొంతమంది పుట్టుక, చావులు మరొకరి కోసమే అన్నట్టు ఉంటాయి. తెలిసి, తెలియక కొందరి జీవితాలు మరి కొందరి జీవితాలను నిలబెడతాయి. ఓ యువకుడి మరణం.. నీచుడి వలలో చిక్కుకున్న డబ్బున్న అమ్మాయిని రక్షించడానికి ఉపయోగపడింది.

  • Published Mar 04, 2024 | 11:43 AMUpdated Mar 04, 2024 | 11:43 AM
చనిపోతూ డబ్బున్న అమ్మాయిని.. నీచుడి నుంచి కాపాడిన మంచోడు

కేవలం కెమెరా కోసం ఒక యువకుడు ఒక అమాయకుడి ప్రాణం తీశాడు. విశాఖలోని మధురవాడ సమీపంలో బక్కన్నపాలెం గ్రామానికి చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ (23) స్థానికంగా ఫోటోగ్రాఫర్. పేదవాడు అయిన సాయి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక అమ్మా, నాన్నలని రిక్వెస్ట్ చేసి 15 లక్షలు పెట్టి కెమెరా కొనిపించుకున్నాడు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయినా కానీ వాళ్ళు కొడుకు ఎదుగుదల కోసం అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు సాయి. ఈ క్రమంలోనే ఒక నీచుడు కన్ను పడింది. ఆ కెమెరాను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్ర పన్నాడు షణ్ముఖ తేజ.

షణ్ముఖ తేజది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం గ్రామం. చిన్న చిన్న ఈవెంట్లకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. అయితే ఇతనికి వైజాగ్ లోని ఓ డబ్బున్న అమ్మాయితో ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడింది. ఆమెకు తానొక కోటీశ్వరుడిని అని అబద్ధం చెప్పాడు. అక్కడితో ఆగకుండా తన దగ్గర లక్షలు విలువ చేసే కెమెరాలు, కెమెరా సంబంధిత పరికరాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి నిజమైతే చూపించు అని అన్నది. షణ్ముఖ దగ్గర అంత విలువైన కెమెరాలు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించి ఆన్ లైన్ లో వెతకగా ఫోటోగ్రాఫర్ సాయి గురించి తెలుసుకున్నాడు. సాయి దగ్గర ఉన్న కెమెరా లక్షల్లో ఉంటుందని తెలుసుకుని దాన్ని దక్కించుకోవాలని పథకం వేశాడు.

సాయిని చంపి నుంచి ఆ కెమెరాని సొంతం చేసుకోవాలనుకున్నాడు. దాన్నే తన ప్రియురాలికి చూపించి ఆమెను ట్రాప్ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా షణ్ముఖ తేజ.. సాయిని కాంటాక్ట్ అయ్యాడు. రావులపాలెంలో ఒక ఈవెంట్ ఉందని నమ్మించి పిలిపించాడు. రావులపాలెం వచ్చిన సాయిని తెలిసిన వ్యక్తి కారులో ఎక్కించుకుని సీటు బెల్టుతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత గోదావరిలో పూడ్చి పెట్టాడు. అయితే చనిపోయే ముందు మార్గం మధ్యలో సాయికి అనుమానం రావడంతో కారు నంబర్ ని ఫోటో తీసి తల్లికి పంపించాడు. అలానే షణ్ముఖ తేజ నంబర్ ఇచ్చాడు. తన ఫోన్ పని చేయకపోతే షణ్ముఖ తేజకి చేయమని చెప్పాడు.

కొడుకు మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా షణ్ముఖ్ రాజమండ్రిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతని ఫోన్ నంబర్ స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు షణ్ముఖ తేజ కాల్ డేటా పరిశీలించారు. కాల్ డేటా ఆధారంగా షణ్ముఖ తేజ ఎక్కువగా ఒక అమ్మాయితో బాగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ యువతి అడ్రస్ తెలుసుకున్న పోలీసులు ఆమె విశాఖలోని అక్కయ్యపాలెం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఫోన్ నుంచి షణ్ముఖ తేజతో చాటింగ్ చేశారు. ఎక్కడున్నాడో అడగ్గా అన్నవరంలో ఉన్నట్లు యువతి ఫోన్ కి మెసేజ్ చేశాడు.

పోలీసులు అన్నవరంలో షణ్ముఖ తేజను అదుపులోకి తీసుకున్నారు. సాయి హత్యలో నిందితుడికి సహకరించిన వినోద్ అనే వ్యక్తిని పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనలో సాయి చనిపోతూ ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాడు. తనకు తెలియకుండానే ఒక అమాయకురాలి జీవితం బలి కాకుండా కాపాడగలిగాడు. ఇలాంటి నీచుడి వలలో పడకుండా ఆ అమ్మాయిని రక్షించాడు. డబ్బున్న అమ్మాయి అని.. ప్రేమ పేరుతో దగ్గరైతే ఆమె నుంచి డబ్బులు కాజేయచ్చు అని ఆలోచించాడు షణ్ముఖ తేజ. కానీ తనకు తెలియకుండానే సాయి ఒక అమ్మాయి జీవితాన్ని నీచుడి చెర నుంచి రక్షించాడు.