iDreamPost
android-app
ios-app

చిన్న పిల్లాడికి పెళ్లి చేసినట్లు.. పవన్ రాజకీయం ఉంది: MLA మధుసూధన్ రెడ్డి

చిన్న పిల్లాడికి పెళ్లి చేసినట్లు.. పవన్ రాజకీయం ఉంది: MLA మధుసూధన్ రెడ్డి

ప్రస్తుతం ఏపీలో రాజకీయం వైసీపీ, జనసేన మధ్య అన్నట్లు సాగుతోంది. ప్రభుత్వంపై జనసేన అధినేత విమర్శలు చేయడం, వాటికి వైసీపీ నేతలు, మంత్రులు ఉదాహరణలతో సహా కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. పవన్ కల్యాణ్  రాజకీయాలకు అతిథిలా వచ్చి..వెళ్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సినిమాల్లో విరామం వచ్చినప్పుడు.. ఏపీ గుర్తుకు వస్తుందన్నారు. బుధవారం విశాఖపట్నంలోని రిషికొండను, భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ప్రభుత్వం కొండలను తవ్వేస్తుందటూ విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల కూడా  అదే స్థాయిలో స్పందించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనదైన శైలీలో పవన్ పై  కామెంట్స్ చేశారు. చిన్న పిల్లాడికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో.. పవన్ రాజకీయం అలానే ఉందంటూ సెటైర్లు వేశారు.

తిరుపతి  జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖలో వారాహి యాత్ర పేరుతో పర్య‌టిస్తూ వైసీపీ నేతలను రెచ్చ‌గొట్టేలా మాట్లాడటంపై ఆయన మండిప‌డ్డారు. ప‌వ‌న్‌కు రాజ‌కీయ ప‌రిజ్ఞానం, హుందాత‌నం లేవ‌న్నారు. విశాఖ‌లో ప‌వ‌న్ ఆరోపిస్తున్న కొండ‌ల‌పై ఒక్క ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయా? అంటూ ప్రశ్నంచారు.

అదే విశాఖలో కొండలపై ఒకవైపు రామాయుడు స్టూడియో, మరోవైపు భవనాలు, కాలేజీలు ఉన్నాయని మధుసూదన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇవేవీకట్టినప్పుడు లేని అభ్యంతరం ప్రభుత్వ భవనాలు కడితేనే ఏమో అవుతున్నట్లు పవన్ ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మొదటి పెళ్లి చేసుకుంది విశాఖపట్నం అమ్మాయినే అని గుర్తు చేశారు. ఆమెకు విడాకులిచ్చాడని, అలాంటి వ్యక్తి వచ్చి.. విశాఖకు అన్యాయం జరిగిందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదారు త‌ర‌గ‌తుల పిల్ల‌ల‌కు పెళ్లి చేస్తే ఎట్లా వుంటుందో, ప‌వ‌న్‌  చేస్తున్న రాజ‌కీయం అలా వుంద‌న్నారు. విశాఖలోని కొండల చుట్టూ చంద్ర‌బాబు, ఆయ‌న బంధువుల‌కు సంబంధించి వంద‌లాది ఆస్తులున్నాయ‌న్నారు.

వాటి గురించి పవన్ మొద‌ట మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పవన్ , ఆయన కుటుంబం కొండ‌మీద కాకుండా, కొండ కింద ఉన్నారా? అని మ‌ధుసూద‌న్‌రెడ్డి ప్రశ్నించారు. అక్కడ కొండ‌మీద క‌ట్టుకున్న ఇంటిని ప‌వ‌న్ ఖాళీ చేయాల‌ని డిమాండ్ చేశారు. సునామీ వస్తుందన్నారు,అలా వస్తే తొలుత ఇబ్బంది పడేది రాష్ట్ర సీఎంమే కదా?. అంటే ప్రజలకు ముఖ్యమంత్రే భరోసా ఇస్తున్నట్లు కదా? అని మధుసూదన్ అన్నారు. ప‌వ‌న్‌కు ఆలోచ‌న‌లు, ఆశ‌యాలు లేవ‌ని ఆయన విమ‌ర్శించారు. మరి.. శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వైసీపీ దారిలోకి స్టార్ ప్రొడ్యూసర్స్! ఇప్పటికి జ్ఞానం బోధపడిందట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి