iDreamPost

వైసీపీ దారిలోకి స్టార్ ప్రొడ్యూసర్స్! ఇప్పటికి జ్ఞానం బోధపడిందట!

వైసీపీ దారిలోకి స్టార్ ప్రొడ్యూసర్స్! ఇప్పటికి జ్ఞానం బోధపడిందట!

ఏపీలో రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. ముఖ్యంగా కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాలు సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించాయి. పిచ్చుకపై బ్రహ్మస్త్రం ఎందుకంటూ చిరంజీవి పరోక్షం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అలానే హీరోలా రెమ్యునరేషన్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ లో ప్రస్తావించారు. అంతేకాక వైసీపీ నేతలు కూడా హీరోలా రెమ్యూనరేషన్ వల్లే.. నిర్మాతలు నష్టంపోతున్నారని ఆరోపించారు. తొలుత వైసీపీ నేతల మాటలను కొందరు నిర్మాతలు వ్యతిరేకించిన.. తాజా పరిస్థితులను బట్టి.. వారు మాట్లాడింది కరెక్ట్ కదా అనే భావనలోకి వెళ్లారంట.

ప్రస్తుతం భారత దేశ చిత్రపరిశ్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇక్కడి నుంచి భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ బడ్జెట్ లో హీరోహీరోయిన్ల రెమ్యునరేషనే ఎక్కువగా ఉంటుందంట. అగ్ర హీరోలు ప్రతి సినిమాకు పది నుంచి ఇరవై కోట్ల పారితోషికం పెంచుతుంటే, ఒక మాదిరి హీరోలు ప్రతి సినిమాకు అర కోటి నుంచి కోటి పెంచి ఇమ్మంటున్నారట. అది కూడా ముందు సినిమా ఫలితంతో సంబంధం లేకుండానే పెంచేస్తున్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. అలానే వైసీపీ నేతల కూడా విజయసాయిరెడ్డి మాటలను సమర్ధిస్తూ మాట్లాడారు.

హీరోలో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే.. సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం లేదని, తద్వారా నిర్మాత, ప్రేక్షకులపై భారం కూడా తగ్గుతుందని వైసీపీ నేతలు, మంత్రులు అన్నారు. వీరి మాటలపై తొలుత నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ.. తరువాత ఆలోచించగా వైసీపీ నేతలు చెప్పిందే కరెక్ట్ అనే భావనలోకి వెళ్లారు. సినిమా నిర్మాణంలో అధిక భాగం హీరోహీరోయిన్ల రెమ్యునరేషనే ఉంటుంది. అదే తగ్గించుకుంటే.. ప్రభుత్వాలు  టికెట్ల రేట్లు పెంచకున్న.. నిర్మాతలకు నష్టం ఉండదు. అదే విధంగా ప్రేక్షకుడు ఎలాంటి అదనపు భారం లేకుండా థియేటర్ కు వెళ్తాడు.

సాధారణంగా హీరోహీరోయిన్ల రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా జీఎస్టీతో కలిసి వందకోట్లతో తెరకెక్కే సినిమాలకు ప్రభుత్వాలు టిక్కెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తుంది. కానీ సినిమా నిర్మాణంలో హీరోల  రెమ్యునరేషన్ కలవడం వలన నిర్మాతలకు భారంగా మారింది. గతంలో ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణలు చాలా తక్కువ పారితోషకం తీసుకునే వారు. ఎప్పుడైనా పెంచుకోవాలంటే నిర్మాతల అనుమతితో కొంతమేర పెంచుకునే వారు. కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ నిర్మాతకు కనీస గౌరవం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక పారితోషకం అనేది హీరోలు.. తమ ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు.

వారి రెమ్యునరేషన్ కారణంగా సినిమాలు బ్రేక్ ఈవేన్ ను సాధించేందుకు చాలా సమయం పడుతుంది. అదే తగ్గిస్తే.. ఇటు నిర్మాత, అటు ప్రేక్షకుడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వైసీపీ నేతలు చెబుతున్న విషయం  కూడా ఇదే కావడంతో ఇప్పుడు నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కదా.. అంటే సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనేవే అనే భావనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి.. ఇప్పటికైన నిర్మాతలు..హీరోల రెమ్యునరేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచిచూడలి. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జగన్ బలం పెరిగిందా? ఈసారి ఇంకా గట్టిగా కొట్టేలా ఉన్నాడే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి