అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. తెలివితో పట్టుకున్న మహిళ!

కొందరు ఇళ్లలో, షాపుల్లో, దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. అడ్డువచ్చే మహిళలపై, పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు. కొందరు మహిళలు మాత్రం తెగువు చూపి.. ఆ దొంగలను పట్టుకుంటున్నారు.

కొందరు ఇళ్లలో, షాపుల్లో, దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. అడ్డువచ్చే మహిళలపై, పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు. కొందరు మహిళలు మాత్రం తెగువు చూపి.. ఆ దొంగలను పట్టుకుంటున్నారు.

నేటికాలంలో అక్రమంగా , సులువుగా డబ్బులు సంపాదించాలనే వారి సంఖ్య బాగా  పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కొందరు ఇళ్లలో, షాపుల్లో, దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. అడ్డువచ్చే మహిళలపై, పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు. అంతేకాక మరికొన్ని సందర్భాల్లో హత్య చేసుకుందు కూడ వెనుకడు వేయడం లేదు. అందుకే చాలా మంది మహిళలు ఒంటరిగా పడుకునేందుకు భయపడుతుంటారు. ఇక దొంగలు వచ్చారంటే..భయంతో  బయటకు పరుగులు తీస్తుంటారు. అయితే  ఓ మహిళ చూపిన తెగవ..ఎంతో మంది ఆడవారికి స్పూర్తి అని చెప్పాలి. అర్ధరాత్రి ఇంట్లోకి  చొరబడిన దొంగలను తెలివితో ఆ మహిళ పోలీసులకు పట్టించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మర్రిస్వామి ఠం కాలనీలో ఉరుకుందమ్మ అనే మహిళ తన కుటుంబంతో కలసి నివాసం ఉంటుంది. స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  బుధవారం అర్ధరాత్రి ఊహించిన ఘటన ఎదురవ్యడంతో ఆమె షాకి గురైంది. అయితే వెంటనే తెరుకుని దొంగలకు బుద్ది చెప్పింది. బుధవారం అర్ధరాత్రి ఉరుకుందమ్మ ఇంట్లో చోరి జరిగింది. మఠం కాలనీలి చెందిన ఈ ఉరుకుందమ్మ తన ఇంటికి తాళం వేసి బయట మంచంపై నిద్రిస్తున్నారు.

ఇక అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ ఇంటి తాళం పగులకొట్టి ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు. అలా దొంగలు తన ఇంట్లోకి వెళ్లడాన్ని ఆ మహిళ గమనించింది. తొలుత బయటపడిన ఆమహిళ ఆ తరువాత ధైర్యం తెచ్చుకుంది. ఎక్కడ గట్టిగా అరిస్తే వాళ్లు పారిపోతారు అనే  ఆలోచనతో సైలెంట్ గా ఉంది. ఇదే సమయంలో ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దొంగలు పడిన విషయాన్నిచెప్పింది. ఇక పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న దొంగలు పారిపోయేందుకు బయటకు పరుగులు పెట్టారు. అందులోని ఓ వ్యక్తిని పోలీసులు, స్థానికులు పట్టుకొగా ప్రజలు దొంగపై దాడిచేశారు.

గాయపడిన దొంగను ముందుగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఇక  తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆ మహిళ కొన్ని విషయాలను తెలిపింది. పారిపోయిన దొంగ  తన ఇంట్లో బీరువాలోని రూ.2 లక్షల డబ్బులను, 3 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు ఆ మహిళ తెలిపారు. తమకు చిక్కిన దొంగను విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు. మరి..  ఆ మహిళ చేసిన పనికి స్థానికులు ప్రశంసిస్తున్నారు.

గతంలో కూడా యాదాద్రి భువన గిరి జిల్లాలో  ఓ గ్రామంలో వృద్ధురాలు చేసిన పనికి దొంగలే అవాక్కయ్యారు.  తన ఇంట్లో ముందే చోరీ జరుగుతుందని గమనించిన ఆ వృద్ధురాలు విలువైన వస్తువులు మొత్తం వేరే వాళ్ల ఇంట్లో దాచింది. ఆమె అనుకున్నట్లుగానే ఆ వృద్దురాలి ఇంట్లో చొరబడిన దొంగలు..వస్తువులను చెల్లచెదురు చేశారు. చివరకు ఏమి దొరక్క అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం తన ఇంటిని గమనించిన మహిళ.. అసలు విషయం స్థానికులు తెలిపింది. దీంతో ఆమె తెలివికి అందరు ప్రశంసల వర్షం కురిపించారు.

Show comments