నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. ఇదే సమయంలో మరోవైపు అమానుష ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఘటనలు చూసినప్పుడు మనం మనుషుల మధ్యనే ఉన్నామా? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఇటీవలే ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన, మరో యువకుడి చేత బలవంతంగా తమపాదాల్ని నాకించిన దారుణ ఘటనలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిని రక్తం వచ్చేలా చావబాది.. ఆ తరువాత నోట్లో మూత్రం పోశారు. ఈ ఘటన ఒంగోలు జిల్లాలో నెల క్రితం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాధితుడు మోటా నవీన్ గిరిజన యువకుడు ఒంగోలు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడు రామాంజనేయులు అలియాస్ అంజి, బాధితుడు నవీన్ మంచి స్నేహితులు. వీరిద్దరూ చిన్నతనం నుంచి జులాయిగా తిరుగతూ నేరాలకు పాల్పడే వారు. అలా ఇళ్లల్లో, దుకాణాల్లో చోరీలు చేసి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు. వీరిద్దరిపై సుమారు 50కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష కూడా అనుభవించాడు. అయితే పోలీసులకు చిక్కకుండా అంజి కొన్నేళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఇలా ఒకరు జైలు శిక్ష అనుభవించి.. మరోకరు పరారిలో ఉంటున్నారు. అయితే కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అంజి.. నవీన్‌ను ఫోన్ చేసి మద్యం తాగుదామంటూ ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజి వెనుక పిలిచాడు. అయితే అంజి పథకం ప్రకారం.. అప్పటికే 9 మంది కాపు కాసి ఉన్నారు. నవీన్, అంజిలతో పాటు అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అంజి పాత వివాదాన్ని మరోసారి లేవనేత్తడంతో మాటామాటా పెరిగింది. అక్కడున్న తొమ్మిది మందీ కలసి నవీన్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని బాధితుడు బతిమిలాడిన కనికరించలేదు.
విచక్షణారహితంగా దాడి చేసి రక్త వచ్చేలా కొట్టారు. అంతటితో ఆగకుండా అతడి నోట్లో మూత్రం పోస్తూ తాగాలని బలవంతం చేశారు. మూత్రం పోసిన వ్యక్తి మర్మాంగాన్ని నవీన్ నోట్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. ఈ దారుణాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియోలు వెలుగులోకి వచ్చింది. ఈఘటనపై స్పందించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి.. ఈ అమానుష ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కానీ, అంతలోనే!