iDreamPost
android-app
ios-app

పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కానీ, అంతలోనే!

  • Published Jul 19, 2023 | 7:20 PM Updated Updated Jul 19, 2023 | 7:20 PM
  • Published Jul 19, 2023 | 7:20 PMUpdated Jul 19, 2023 | 7:20 PM
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కానీ, అంతలోనే!

పైన ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న ఈ యువతి పేరు రాజేశ్వరి, వయసు 20 ఏళ్లు. పెంచి పెద్ద చేసిన ఆమె తల్లిదండ్రులు గతేడాది రమేష్ అనే యువకుడితో వివాహం జరిపించారు. ఇక పెళ్లిలో భాగంగా రాజేశ్వరి తల్లిదండ్రులు కట్న కానుకలు బాగానే ముట్ట చెప్పినట్లు తెలుస్తుంది. అలా పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఈ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అస్సలు నమ్మలేకపోతున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మూడుతండా పరిధిలోని పెద్ద మంగళితండా. ఇక్కడే భూక్య రమేష్-రాజేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది వివాహం జరిగింది. పెళ్లిలో భాగంగా రాజేశ్వరి తల్లిదండ్రులు కట్న కానుకలు బాగానే ఇచ్చినట్లు తెలుస్తుంది. అలా వివాహం జరిగిన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. కానీ, గత కొన్ని రోజుల నుంచి భర్త రమేష్ అదనపు కట్నం తేవాలంటూ భార్య రాజేశ్వరిని వేధించినట్లు సమాచారం.

ఇక భర్త టార్చర్ రాను రాను మరింత ఎక్కువైంది. ఇదే విషయాన్ని రాజేశ్వరి తన తల్లిదండ్రులకు వివరించి కన్నీరు మున్నీరైంది. ఆ యువతి తల్లిదండ్రులు ఏదో చెప్పి నచ్చ జెప్పారట. అయితే, రమేష్ ఇటీవల మరోసారి భార్యను వేధించినట్లు తెలుస్తుంది. ఇక భర్త టార్చర్ తో విసుగు చెందిన రాజేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. మూడు రోజుల కిందట ఈ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో రాజేశ్వరి బుధవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: బోనాల్లో కొండచిలువతో పోతురాజు హల్చల్.. కట్ చేస్తే, సీన్ రివర్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet