iDreamPost
android-app
ios-app

ఊహించినట్లుగానే ఆ సీనియర్లకి షాకిచ్చిన చంద్రబాబు!

TDP, Janasena: శనివారం జనసేన, టీడీపీ ఉమ్మడి జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో పలువురు సీనియర్ల నేతకు ఆశాభంగం కలిగింది.

TDP, Janasena: శనివారం జనసేన, టీడీపీ ఉమ్మడి జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో పలువురు సీనియర్ల నేతకు ఆశాభంగం కలిగింది.

ఊహించినట్లుగానే ఆ సీనియర్లకి షాకిచ్చిన చంద్రబాబు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఈ ప్రకటన చేశారు. బీజేపీ ఊసు లేకుండానే.. 118 స్థానాలకు ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 57 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ పొత్తులు చేరితే..ఆ స్థానాల్లో టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ తొలి జాబితాలో టీడీపీ సీనియర్ నేతలకు ఆ  పార్టీ షాకిచ్చింది.

శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 118 స్థానాలతో తొలి జాబితాను ఈ కూటమి విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరఫున 24 అసెంబ్లీ స్థానాలకు కేవలం ఐదు స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని పవన్‌ ప్రకటించారు. అయితే జనసేనకు పావలాంతు సీట్లు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. 175 స్థానాలకు గాను కేవలం 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయనుంది.

అయితే గతంలో జనసేన లేకుండా టీడీపీ గెలవ లేదని పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ.. సీట్ల ప్రకటన తరువాత అంత చంద్రబాబే తన పంతం నెగ్గించుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఇక తొలి జాబితా ప్రకటన సమయంలో బీజేపీ ప్రస్తావన రాగానే.. ఇరువురూ చెరో మాట చెప్పడం గమన్హారం. తమ పొత్తుకు బీజేపీ శుభాసీస్సులు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌  చెప్పారు. ప్రస్తుతానికి టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యిందని, పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు బీజేపీ కలిసి వస్తే.. అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. టీడీపీ, జనసేన కూటమి ప్రకటించిన తొలి జాబితాలో పలువురు టీడీపీ సీనియర్లకు షాక్ తగిలింది. టీడీపీ వ్యవస్థాపక సభ్యులో ఒకరైన, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు తొలి జాబితాలో లేదు. అలానే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ఈ జాబితాలో లేదు. విశాఖ జిల్లాకు చెందిన ముఖ్యనేత గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో  లేదు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమన్హారం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న కళా వెంకట్రావుకి చంద్రబాబు హ్యాండిచ్చారు. మొత్తంగా పలువురు టీడీపీ సీనియర్లు చంద్రబాబు షాకిచ్చాడు. మరి..టీడీపీ, జనసేన తొలి జాబితాలో టీడీపీ సీనియర్లకు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.