iDreamPost
android-app
ios-app

బాబు పరువు తీస్తున్న పవన్? టీడీపీ ఆగ్రహం..

Pawan, TDP: జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేస్తున్న కొన్ని కామెంట్స్‌పై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. చంద్ర‌బాబును, టీడీపీని చుల‌క‌న చేసేలా ఆయ‌న కామెంట్స్ ఉన్నాయ‌నే ఆవేద‌న ఆ పార్టీ నేత‌ల్లో వుందని టాక్ వినిపిస్తోంది.

Pawan, TDP: జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేస్తున్న కొన్ని కామెంట్స్‌పై టీడీపీ నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. చంద్ర‌బాబును, టీడీపీని చుల‌క‌న చేసేలా ఆయ‌న కామెంట్స్ ఉన్నాయ‌నే ఆవేద‌న ఆ పార్టీ నేత‌ల్లో వుందని టాక్ వినిపిస్తోంది.

బాబు పరువు తీస్తున్న పవన్? టీడీపీ ఆగ్రహం..

2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అందరిలో తెగ ఉత్కఠంను రేపుతున్నాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేను గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తుంటే.. టీడీపీ, జనసేనలు మాత్రం కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఇక జగన్ ను ఢీకొట్టేందు ఆ బలం సరిపోదూ అన్నట్లు బీజేపీ పొత్తు కోసం కూడా తెగ వెంబర్లడాతున్నారు. మొత్తంగా చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఎదుర్కొన్ని పరిస్థితులను ప్రస్తుతం ఎదరవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రసంగాలు, వ్యాఖ్యలు బాబు పరువు తీస్తున్నాయని టీడీపీ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 52 రోజులు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జైల్లో ఉన్నప్పుడు పరామర్శించేందుక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి..టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి తరచూ తాను టీడీపీని ఆదుకున్నాను అన్నట్లు పలు సందర్భాల్లో పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను లేకపోతే..టీడీపీకి విజయం కష్టం అనే విధంగా ఆయన చేసిన మాటలు ఉన్నాయని అప్పట్లోనే పలువురు టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చాలా బల‌హీనంగా వుంద‌ని, త‌మతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే ఆ పార్టీ నిల‌బ‌డ‌గ‌లిగింద‌నే ప‌వ‌న్‌ చేసిన కామెంట్స్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నేతలకు రుచించ‌డం లేదని సమాచారం.

ప‌ట్టుమ‌ని ఒక ఎమ్మెల్యే కూడా వెంట‌లేని విష‌యాన్ని ప‌వ‌న్‌ మర్చిపోయినట్లు ఉన్నారని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఒంట‌రిగా పోటీ చేస్తే, క‌నీసం తానే గెల‌వ‌లేన‌నే భ‌యంతోనే త‌మ‌తో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్ప‌డం స‌బ‌బుగా లేద‌ని టీడీపీ నాయకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీడీపీ వ‌ల్ల జ‌న‌సేన రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందుతున్న‌దే త‌ప్ప‌, ఆ పార్టీతో త‌మ‌కు కొత్త‌గా ఒరిగిందేమీ లేద‌ని టీడీపీ నేత‌లు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల బీజేపీతో  పొత్తు అంశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చేందుకు తానెంతో న‌లిగిపోయాన‌ని, అంతేకాకుండా, చీవాట్లు కూడా తిన్న‌ట్టు చెప్ప‌డం త‌మ‌ను అవ‌మానించ‌డమేనని టీడీపీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

బీజేపీతో పొత్తు కుదిర్చేందుకు ఆ పార్టీ అగ్ర‌నేత‌ల‌కు దండం పెట్టి బ‌తిమ‌లాడిన‌ట్టు ప‌వ‌న్ చెప్ప‌డం తమ అధినేతను అవ‌మానించ‌డంగా ఆ పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే బీజేపీతో పొత్తు కోసం చంద్ర‌బాబు వెంప‌ర్లాడుతున్నార‌నే అర్థం వ‌చ్చేలా ప‌వ‌న్ వ్యాఖ్యలు చేయడం బాగా లేద‌ని టీడీపీ ఫైర్ అవుతున్నారు. అయినా త‌మ పార్టీ ఏమంత అంట‌రానిదేమీ కాద‌ని, పొత్తు కుదుర్చుకోడానికి బీజేపీ పెద్ద‌ల‌తో తిట్లు తినేంత దుస్థితి ఎందుకొచ్చింద‌ని పవన్ ను టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ మాట్లాడేముందు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల‌ని, చంద్ర‌బాబును, అలాగే త‌మ పార్టీ పరువు తీసేలా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని టీడీపీ నాయకులు హిత‌వు చెబుతున్నారని సమాచారం.