APలో రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇక పై ఆ రూట్లలో స్పీడ్ ప్రయాణం!

South Central Railway Say Good News: రైల్వే వ్యవస్థలోకి కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకోస్తుంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలోని ప్రజలకు ఇండియన్ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే తాజాగా ఏపీలోని రైల్వే ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

South Central Railway Say Good News: రైల్వే వ్యవస్థలోకి కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకోస్తుంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలోని ప్రజలకు ఇండియన్ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే తాజాగా ఏపీలోని రైల్వే ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద వ్యవస్థలో  రైల్వే శాఖ ఒకటి.  ఇక నిత్యం లక్షలాది మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అలానే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే రైల్వే వ్యవస్థలోకి కొత్త కొత్త టెక్నాలజీలను తీసుకోస్తుంది. తరచూ ఏదో ఒక ప్రాంతంలోని ప్రజలకు ఇండియన్ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెబుతుంది. అలానే తాజాగా ఏపీలోని రైల్వే ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక తాజాగా అధికారులు చెప్పిన విషయం ప్రకారం.. త్వరలో ఆ రూట్లలో రైళ్ల వేగం పెరగనుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీలోని విజయవడా డివిజన్ పరిధిలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ వ్యవస్థను సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసింది. నూజీవీడు-గన్నవరం సెక్షన్ మధ్య 22 ఆటోమెటిక్ బ్లాక్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ ఏబీఎస్‌  అనేది రైల్వే సిగ్నలింగ్, రైల్వే లైన్లను బ్లాకులుగా విభజిస్తుంది. అలాగే భద్రత, రైల్వే నెట్‌వర్క్, సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ వ్యవస్థ లక్ష్యం. ఆటోమెటిక్‌ సిగ్నల్‌ ద్వారా ఈ బ్లాక్‌ల మధ్య ప్రయాణించే రైళ్ల కదలికలను నియంత్రిస్తుందని  అధికారులు చెబుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే గన్నవరం-నూజివీడు సెక్షన్ లో రూ.31.81కోట్ల వ్యయంతో ఈ సాంకేతి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా వచ్చిన ఈ సాంకేతిక వ్యవస్థ ద్వారా ప్రయాణికులు, సరకు రవాణా రైళ్లు సాఫీగా, సురక్షితంగా సాగించేందుకు ఉపయోగపడుతుంది అధికారులు చెబుతున్నారు. గన్నవరం,పెదఅవుటపల్లి, తేలప్రోలు, నూజివీడు స్టేషన్లలో ఈ ఏబీఎస్‌ పరికరాలను అమర్చారు.

అదే విధంగా విజయవాడ డివిజన్ పరిధిలోని  బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వే యార్డులో వెల్డబుల్‌ కాస్ట్‌ మాంగనీస్‌ స్టీల్‌ అందుబాటులోకి వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే జన్ పరిధిలో విజయవాడ, గూడూరు మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో తొలిసారి వేటపాలెంలో డబ్ల్యూసీఎంఎస్‌ ఏర్పాటు చేశారు. మాములుగా అయితే ఏదైనా రైలు మరో ట్రాక్ పైకి మారే సమయంలో తక్కువ స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ వేగం పెరిగేతే పట్టాలు తప్పే ఛాన్స్ ఉంటుంది.

ఈ కొత్త వ్యవస్థతో రైలు క్రాసింగ్‌ సమయంలో 130కిమీ వేగంతో ట్రాక్‌ మారే అవకాశం ఉంటుంది. ఈ అత్యాధునిక టెక్నాలజీతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని రైల్వే అధికారులు. ఈ టెక్నాలజీతో విజయవాడ డివిజన్ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో రైలు పట్టాల క్రాసింగ్‌లోనూ మార్పులతో రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని, అలాగే నిర్ణీత సమయంలోనే ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరవచ్చుని అధికారులు చెబుతున్నారు.

Show comments