Arjun Suravaram
IAS Officer Imtiaz Joins In YSRCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. అధికార వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేనల నుంచే పెద్ద ఎత్తున చేరికలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూడా వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు.
IAS Officer Imtiaz Joins In YSRCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. అధికార వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ, జనసేనల నుంచే పెద్ద ఎత్తున చేరికలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూడా వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు.
Arjun Suravaram
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు అన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీకి షాకిస్తూ.. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు జిల్లాలకు కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆయన ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. అలానే వివిధ శాఖలకు ప్రధాన కార్యదర్శిగా పని చేసి.. తనదైన మార్క్ ను చూపించారు. ప్రస్తుతం సెర్ప్ సీఈవో, మైనార్టీ సంక్షేమ కార్యదర్శిగా ఇంతియాజ్ పని చేస్తున్నారు. ఈ సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన..సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇంతియాజ్‌ను పేరును సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంతియాజ్ స్వస్థలం కర్నూలు జిల్లానే కావడం విశేషం. ఆయనకు కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో సొంత బలం ఉంది. అలానే కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో జరుగుతున్న వివాద నేపథ్యంలో ఇంతియాజ్ చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలానే వైఎస్సార్ సీపీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడయ్యానని జాయిన్ అయ్యే సందర్భంలో ఆయన తెలిపారు. పార్టీ బలపేతం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. మరి.. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఐఏఎస్ అధికారి వైఎస్సార్ సీపీలోకి చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.