Arjun Suravaram
AP Political News: ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
AP Political News: ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
Arjun Suravaram
విద్యార్థికి పరీక్షలు అనేవి చాలా ప్రధానమైనవి. ఆ సమయంలో ఎలా చదివాం? ఎలా రాశాం? అనేది ఎంతో ముఖ్యం వాటిని బట్టే విద్యార్థులు పొందే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇదే ఫార్ములా..రాజకీయాల్లో ఎన్నికల సమయంలో కూడా నేతలకు వర్తిస్తుంది. ఎలక్షన్ టైమ్ లో ఎంత వ్యూహంతో, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాము అనేది చాలా ప్రధానమైనది. అయితే ఈ విషయం టీడీపీ జనసేన కూటమి అర్థం కాలేదని పలువురు అభిప్రాయం పడుతున్నారు. అందుకే ఓ విషయంలో అధికార వైఎస్సార్ సీపీ సక్సెస్ అయ్యింది. అలానే టీడీపీ జనసేన కూటమి అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజకీయ పార్టీల ఎత్తులు, వ్యూహాలే అధికారాన్ని తీసుకురావడం, చేజారిపోవడంలో కీలక పాత్ర పోషిస్తాయ. రాజకీయ పార్టీల ప్రతి కదలికలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల సన్నద్ధం సభలను ప్రజలు డేగకళ్లతో పరిశీలిస్తున్నారు. సిద్ధం నినాదంతోఅ అధికార పార్టీ, ‘జెండా’ పేరుతో ఇటీవల కూటమి సభలు నిర్వహించాయి. ఇంత వరకూ భీమిలీ, దెందులూరు, రాప్తాడులో మూడు సిద్ధం సభలు నిర్వహించింది. ఒకదానికి మించి మరొక సభ సూపర్ సక్సెస్ అయ్యింది.
ఇదే సమయంలో ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన కూటమి నిర్వహించిన జెండా సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇలా జరుగుతుందని ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఊహించి ఉండరు. కూటమి నిర్వహించిన సభ…. ఒక ఎజెండా లేకుండా సాగిపోయింది. సిద్ధం సభల్లో జగన్ తన పార్టీ నాయకులను, శ్రేణులను ఎన్నికల సమరానికి రెడీ చేసేందుకు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో ఏం చేశామో వివరించి, తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడిని అంటూ ఉత్సాహపరిచారు. అలాగే ప్రజలను కృష్ణుడితో పోల్చి, గొప్ప గౌరవాన్ని కల్పించారు. ఈ ఎన్నికల సమరంలో కార్యకర్తలే తన సైన్యం అని, లబ్ధిదారులే క్యాంపెయినర్లని చెప్పడం ద్వారా ఉత్సాహాన్ని నింపారు.
ఇదే సమయంలో టీడీపీ, జనసేన కూటమి నిర్వహించిన సభలను చూసినట్లు అయితే.. రెండు పార్టీల శ్రేణుల్లో ఎలాంటి జక్షస్ కనిపించలేదు. కేవలం సీఎం జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు, పవన్ ల సభ అన్నట్లు వారి ప్రసంగం పరిమితం అయ్యింది. జగన్‌ను ఎందుకు గద్దె దించాలో, తమను అధికారంలోకి తెస్తే ఏం చేస్తామో… చంద్రబాబు, పవన్ వివరించలేదు. పవన్‌కల్యాణ్ చేసిన ప్రసంగం జనసేనతో పాటు టీడీపీకి కూడా ఓట్లు వేయొద్దని ఆయన అభిమానులు నిర్ణయించుకునేలా చేశాయి. ఈ సభ జనసేన కార్యక్రర్తల్లో తీవ్ర నిరాశ నింపగా, టీడీపీలో ఆందోళన కలిగించింది. కూటమి సభ ఒక లక్ష్యం లేకుండా సాగింది. మొదటి సభే ఇలా జరగడంతో టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది. మళ్లీ జగనే వచ్చేలా ఉన్నారనే అభిప్రాయాన్ని ప్రత్యర్థుల్లో కలిగించడంలో వైఎస్సార్ సీపీ సభలు సక్సెస్ అయ్యాయి. అలానే కూటమి నిర్వహించిన సభ నిరాశను మిగిల్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.