గాజువాకపై పవన్ ఆశ! ఇక్కడ రియాలిటీ వేరు బాస్!

గాజువాకపై పవన్ ఆశ! ఇక్కడ రియాలిటీ వేరు బాస్!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తరువాత నుంచి ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వారాహి యాత్ర పేరుతో భారీ బహిరంగ సభలు పవన్ నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా విశాఖపట్నంలోని గాజువాకలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందన్నారు. అయితే గాజువాకలో పవన్ కల్యాణ్ కి గెలుపు అనేది అంత ఈజీకాదని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి..రెండూ చోట్ల ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే  అధికార వైసీపీ.. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. 151 మందిని గెలిపించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే  ఆదివారం గాజువాకలో పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో ఓడిపోయినా తన ఓటమి అనిపించడం లేదని, 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కి గాజువాకలో గెలుపు అంతా ఈజీ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లోకల్ గా స్ట్రాంగ్. ఆయన 2009లోనే స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. భారీగా ఓట్లు సంపాందించారు.  ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించగా, టీడీపీ, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి.. స్వతంత్ర అభ్యర్థి అయినా తిప్పల నాగిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. దీని బట్టి ఆయన అక్కడ ఎంత బలమైన నేతనో చెప్పొచ్చు. అలానే 2014లో గాజువాకలో టీడీపీ గెలిచింది. ఆ తరువాత 2019 వైసీపీ  ఇక్కడ ఘన విజయం సాధించింది. 2019లో తిప్పల నాగిరెడ్డి వైసీపీ తరపున బరిలో దిగి..పవన్ ను ఓడించి.. రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గాజువాక నియోజకవర్గంలో తిప్పల నాగిరెడ్డికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది.  ఆ తరువాతి స్థానంలో తెలుగు దేశం పార్టీ ఉంది. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వస్తున్నాయి.

ఇదే నిజమైతే.. గాజువాకను టీడీపీ వదులుకుంటుందా? అనే ప్రశ్న చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఒకవేళ పవన్ ఇక్కడి నుంచి పోటీ చేసినా.. టీడీపీ శ్రేణులు సహకరిస్తారా? అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గాజువాకలో బలమైన వైసీపీ పార్టీని, అలానే అదే స్థాయిలో బలమైన నేత అయిన  తిప్పల నాగిరెడ్డికి ఎదురొడ్డి పవన్ గెలవడం లేదా.. తన పార్టీ అభ్యర్ధిని గెలిపించడం చాలా కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గాజువాకలో అనేక రాజకీయ ఈక్వేషన్ల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు గెలుపు కష్టమే అనే అభిప్రాయాలు వినిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసిన మరో సారి ఓటమి ఖామనే మాటలు ఎక్కువగా వినిపిస్తోన్నాయి. మరి… గాజువాకలో పవన్ కు మరోసారి ఓటమి తప్పదని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments