Arjun Suravaram
Nagababu, Anakapalle: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అక్కడి నుంచి జెండా పీకేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Nagababu, Anakapalle: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అక్కడి నుంచి జెండా పీకేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఏదైనా సాధించాలంటే మనిషికి నిలకడ, ఓర్పు అనేవి ప్రధానంగా ఉండాలి. అవి లేని వారు ఏ రంగంలోనైనా రాణించలేరు. రాజకీయ రంగంలో కూడా సహనం, ఓర్పు అనేవి కచ్చితంగా ఉండాలి. సరైన సమయం కోసం వేచి చూడాలి. అంతేకానీ..నిలకడలేనితనం ప్రదర్శిస్తే.. వాళ్ల పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటి వరకు తమ రాజకీయాన్ని అలా చీకట్లోకి నెట్టుకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. తాజాగా వారి జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు చేరబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.
జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత ప్రధాన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు. ఇటీవల ప్రకటించిన టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో నాదెండ్ల మనోహర్ పేరును ప్రకటించారు. ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో మాత్రం చెప్పలేదు. భీమవరం,అనకాపల్లి, గాజువాక ఇలా పలు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా పవన్ కల్యాణ్ వ్యవహారం చూసిన వారికి పవన్ మాటల్లోనే కాదు చేతల్లో కూడా క్లారిటీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక ఆయనకు తోడుగా సోదరుడు నాగబాబు కూడా వచ్చి చేరుతున్నారు.
అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అందుకు తగినట్లే నాగబాబు కూడా అనకాపల్లి పరిధిలో పర్యటన చేశారు. అలానే ఇటీవల టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగబాబు ఏపీకి వచ్చారు. అనంతరం, అచ్యుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావుడి చేశారు. సమీక్షల పేరుతో తెగ హడావిడి చేశారు. ఈ క్రమంలో అనకాపల్లిలో సర్వేలు కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆ సర్వేల్లో నాగబాబుకు ప్రతికూల ఫలితాలు వచ్చాయని టాక్. ఆ కారణంగా ఓటమి భయం నాగబాబులో మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో నాగబాబు తన మకాంను అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు మార్చారని సమాచారం.
మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా అదే తరహాలో తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే ముందు రోజు వరకు కూడా పవన్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున మాత్రమే ఏపీకి వచ్చారు. ఆ మీటింగ్ అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్లారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థుల విషయంపై కసరత్తు చేయకుండా అలా హైదరాబాద్ వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్న విషయం కూడా ఆయన చెప్పలేదు. ఇలాంటి నేతలా ఏపీ ప్రజల బాగు కోరేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఇద్దరూ పార్ట్ టైమ్ పొలిటిషీయన్స్ అని మరోసారి రుజువు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా చంద్రబాబుకు సహకరించేందుకే వారు ఉన్నట్టు నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.