బండారు వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా!

బండారు వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు అందరి తెలిసిందే. ఆయన చేసిన ఈ కామెంట్స్ పై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు బండారు కామెంట్స్  పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మహిళ కమీషన్ కూడా ఆయన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలంటూ  డీజీపీకి లేఖ సైతం రాశారు. సోమవారం రాత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై  చేసిన వ్యాఖ్యలు దారణమన్నారు.

తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్రయ పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం చాలా తప్పని ఆమె మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు. చంద్రబాబు గాడ్సే కంటే ఘరోమైన వ్యక్తి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరమని చంద్రబాబును ఉద్దేశించి గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు.

టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నట్లు రోజా చెప్పారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీకి కంచాలు మోగించడానికి కూడా జనాలు ముందుకు రాలేదని ఆమె విమర్శించారు. ఇక బండారు చేసిన వ్యాఖ్యలు.. అతడి తల్లిదండ్రుల పెంపకానికి నిదర్శమని అన్నారు. ఆయన మాటలకు.. ఇంట్లోని ఆడవాళ్లు కూడా సిగ్గుతో తలదించుకుంటారని ఆమె అన్నారు. మరి.. బండారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments