iDreamPost
android-app
ios-app

నేడే క్వాష్ విచారణ.. బాబు జైల్లోనే ఉండాలని పవన్ ఫ్యాన్స్ పూజలు?

నేడే క్వాష్ విచారణ.. బాబు జైల్లోనే ఉండాలని పవన్ ఫ్యాన్స్ పూజలు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద దిక్కులా కనిపించారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు పవన్ కల్యాణ్ పరోక్షంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తారని పొటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఈక్రమంలో చంద్రబాబు జైల్లోనే ఉండాలని పవన్ కల్యాణ్ అభిమానులు పూజలు చేస్తోన్నట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నెల 5 నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు చంద్రబాబు బయటకు వస్తే.. మాత్రం బస్సు యాత్ర రద్దవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక తమనేత గురించి తెలుగు తమ్ముళ్లు వీధిపోరాటాలు, ఆందోళనలు చేస్తోన్నారు. నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు తెగ పూజాలు చేస్తోన్నారని టాక్ వినిపిస్తోంది.అది ఏమిటంటే.. చంద్రబాబు మరో ఏడాది లేదా రెండేళ్లు జైల్లోనే ఉండాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తోన్నాయి.

చంద్రబాబు జైల్లో ఉంటే.. ఆ పార్టీకి, కూటమికి కలిపి.. పవన్ కల్యాణ్ తప్ప మరొక దిక్కులేదు అనే సంగతి ములాఖత్ నాడే కనిపించింది. ఆ రోజు నారా లోకేశ్, బాలకృష్ణలను డమ్మీలుగా నిలబెట్టి మొత్తం పవన్ కల్యాణే మాట్లాడినప్పుడే అర్ధమైపోయిందని పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ కల్యాణ్ తనకు సీఎం సీటు మీదు మోజు లేదు అంటూనే అవకాశం వస్తే.. కచ్చితంగా సీఎం పదవి స్వీకరిస్తాని ఆయన అనేక సార్లు అన్నారు. ఇక చంద్రబాబు ఉంటే ఈ కూటమి సీఎం అభ్యర్థిగా ఆయనే ఉంటారని, తమ నేతకు రాదని పవన్ అభిమాలు అభిప్రాయ పడుతున్నట్లు టాక్. చంద్రబాబు బయటకు రాకపోతే.. పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

పవన్ సీఎం కావాలంటూ.. వారు దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వారు అనుకున్నట్లు జరగాలంటే..  ఎన్నికలు పూర్తయ్యేదాక చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకూడదని కూడా దేవుణ్ని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.  మొత్తానికి పవన్  కు గ్రహాలు అనుకూలించి, ఆయన సీఎం కావడానికి చంద్రబాబు జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో అనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేశారు. మరి.. పవన్ అభిమానులు పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap