Dharani
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నాడు మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ వివరాలు..
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నాడు మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక అధికార పార్టీ.. అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేస్తూ.. ప్రచార కార్యక్రమాలు నిర్వహించే పనిలో బిజీగా ఉంటే.. విపక్ష కూటమి టీడీపీ, జనసేనలో మాత్రం ఇంకా సీట్ల పంపకం, పొత్తుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీలో పడిగాపులు కాసిన సంగతి తెలిసిందే. ఇటు చూస్తే ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. సిద్ధం సభల నిర్వహణతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నాడు.. బాపట్ల జిల్లా మేదరమెట్లలో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక సిద్ధం సభకు జన ప్రవాహం పోటెత్తింది. ఎటు చూసిన ఇసకేస్తే రాలనంత జనం సభకు తరలి వచ్చారు. ఇదే కాక.. ఇక సోషల్ మీడియాలో సిద్ధం సభ సంచలనం సృష్టించింది. ఆ వివరాలు..
బాపట్ల జిల్లా మేదరమెట్టలో ఆదివారం నాడు సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ట్విట్టర్‌లో వైఎస్ జగన్ ఎగైన్, వైనాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్‌లు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి.. ట్రెండింగ్‌లో నిలిచాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా సైట్లలో సైతం సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. జన సముద్రాన్ని తలపించిన సభా ప్రాంగణం.. సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తున్న ఫొటోలు.. ప్రసంగిస్తుండగా జనం నీరాజనాలు పలుకుతున్న ఫొటోలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు నిండిపోయాయి.
సాధారణంగా నెటిజనులు ఎక్కువగా.. ఎక్స్‌లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ‘ఎక్స్’లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11 వేల మంది వీక్షించడం సంచలనం సృష్టించింది. ఇక గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్‌సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది చూశారు.
‘ఎక్స్’ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభల్లో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో నిలిచిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56 వేల మంది లైవ్‌లో చూడగా.. ఎన్‌టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సోషల్ మీడియా సైట్లు.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది ‘సిద్ధం’ సభను తిలకించారు. సీఎం జగన్‌పై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ, విశ్వసనీయతకు సిద్ధం సభ నిదర్శనంగా నిలిచిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ ప్రజల్లో జగన్ పట్ల ఉన్న క్రేజ్‌ను ఈ సభలు మరోసారి నిరూపించాయి అంటున్నారు.