P Krishna
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయో మూడు నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయో మూడు నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
P Krishna
ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు మండిపోయాయి. ఇక ఏప్రిల్, మే నెలలో చుక్కలు చూపించాయి.. అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లలాడిపోయారు. మధ్యాహ్నం రోడ్లు కర్ఫ్యూ విధించినట్లు తయారయ్యాయి. జూన్ నెలలో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇదిలా ఉంటే.. అరెబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే..
అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది.రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తెలిక పాటి వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో రుతుపవనా ప్రభావం వల్ల సోమ, మంగళ వారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, జనగామ, సంగారెడ్డి, సూర్యపేట, మంచిర్యాల, అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించింది.