పైకేమో బట్టల వ్యాపారం.. లోపల చూస్తే అధికారులకే దిమ్మతిరిగిపోయింది..

అదొక వస్త్ర దుకాణం.. వచ్చే పోయే కస్టమర్లతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. పైగా రంగు రంగుల వస్త్రలు, వ్యాపారం కూడా పర్వాలేదని చెప్పవచ్చు. కానీ, ఆ షాపులో పైకి మాత్రమే బట్టల వ్యాపారం. లోపల చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

అదొక వస్త్ర దుకాణం.. వచ్చే పోయే కస్టమర్లతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. పైగా రంగు రంగుల వస్త్రలు, వ్యాపారం కూడా పర్వాలేదని చెప్పవచ్చు. కానీ, ఆ షాపులో పైకి మాత్రమే బట్టల వ్యాపారం. లోపల చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

సాధరణంగా లైసెన్స్ లేనిదే మందులు విక్రయించడం, మెడికల్ షాప్ రన్ చేయడం చట్టపరంగా నేరం. అయితే ఇలా నగరాల్లో ఎక్కడపడితే అక్కడ లైసెన్స్ లేని, డాక్టర్ సంప్రదింపుల లేని మెడిసెన్స్  విక్రయిస్తే.. వెంటనే వారిపై అధికారుల కఠిన చర్యలు తీసుకుంటరనే విషయం తెలిసిందే. అయిన సరే కొంతమంది మాత్రం ఎక్కువగా డబ్బు సంపదించలనే దురాశతో అడ్డదారులను తొక్కుతుంటారు. తాజాగా ఓ వస్త్ర దుకాణం వ్యాపారి కూడా డబ్బు ఆశతో ఇలాంటి అడ్డదారులను తొక్కాడు. అతను పైకి చేసేది బట్టల వ్యాపారమే కానీ, లోలపల చేస్తున్న పని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 90వ వార్డు,  భాజీ జంక్షన్ మెయిన్ రోడ్డులో కేకే సిల్క్స్ అనే వస్త్ర దుకాణం ఉంది. అయితే ఆ షాపులో నిత్యం వచ్చిపోయే కష్టమర్లతో అత్యంత రద్దీగా..రంగు రంగుల వస్త్రాలు, వ్యాపారం కూడా పర్వాలేదని చెప్పవచ్చు. కానీ, ఆ షాపులో వస్త్రాల కొనేందుకు కస్టమర్లు వస్తున్నరా.. మరి ఏదైనా కొనడానికి వస్తున్నరా అనే సందేహం ఎవరికి వచ్చిందో తెలియదు కానీ, వెంటనే వస్త్ర దుకాణం పై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ షాపుపై కన్నేసి కూపి లాగారు. వెంటనే కీలక సమాచారం అందడంతో శరవేగంగా ఆ షాపు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఇక వారితో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులను కూడా తీసుకెళ్లారు. ఇక లోపలికి వెళ్లి చూస్తే.. అసలు నిజాలతో పాటు షాపు యాజమాని బండారం బయటపడటంతో అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

ఎందుకంటే.. ఆ వస్త్ర దుకాణంలో.. బట్టలతో పాటు ఏకంగా స్లీపింగ్ పిల్స్, అబార్షన్ షీట్లతోపాటు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు కూడా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అంతేకాకుండా.. బాగా విలువ చేసే ఆల్ఫ్రజోలం, స్లీపింగ్ పిల్స్‌తో పాటు, సిల్డేనాఫీల్ సిట్రేట్ టాబ్లెట్స్ కూడా దర్శనమిచ్చాయి. ఇక వాటిని చూసిన అధికారులు వెంటనే వాటిని  సీజ్ చేశారు. ఆనంతరం షాపు యజమాని మళ్లీపూడి హరికృష్ణపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల తనిఖీలో భాగంగా బట్టల వ్యాపారం పేరిట అతను చేస్తున్న ఇల్లీగల్ బిజినేస్ వెలుగులోకి రావడంతో స్థానికంగా అందరూ షాక్ గురైయ్యారు. ఇక పోలీసులు ఇలాంటి నిషేధిత మందులు అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనకు ఉల్లంఘించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. మరీ, బట్టల షాపు పేరుతో వివిధ రకాల మెడికల్ డ్రగ్ ను విక్రయించి వ్యాపారం చేస్తున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments