ఏపీ రాజకీయాలు మంచి హీట్ మీద ఉన్నాయి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్ది.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం గొప్పగా పరిపాలన చేస్తుందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియా విజన్-2047’ను ఆవిష్కరించారు. అయితే చంద్రబాబు ఆవిష్కరించిన విజన్-2047పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచక పడుతున్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన విజన్ దిక్కుమాలినది అంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఫైరయ్యారు.
ఇండియా విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత విద్యత్ పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి ఈ చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని రైతులు ధర్నాలు చేస్తే.. కాల్పులు జరిపించిన ఘనుడు ఈ చంద్రబాబు అని పేర్ని నాని మండిపడ్డారు. అధికారం పోతే హైదరాబాద్ పోవడమే చంద్రబాబు విజనని పేర్ని నాని దుయ్యబట్టారు.
ఇంకా పేర్ని నాని మాట్లాడుతూ..” చంద్రబాబు ఆవిష్కరించిన విజన్ స్తుతి విజన్. చంద్రబాబు గతంలో చెప్పిన విజన్-2020 ఏమైంది. ఆయన విజనరీ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయింది. కనీసం ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశానని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా?. కనీసం తన సొంత నియోజకవర్గం కుప్పానికైనా నీళ్లిచ్చారా?. చంద్రబాబు విజన్ పబ్లిసిటీ పిచ్చి తప్ప.. మరో విజన్ ఉందా?. విద్యారంగాన్ని ఒక్కసారైనా పట్టించుకున్నావా?. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క ప్రభుత్వ పాఠశాలైనా బాగుచేశావా?. అలా బాగు చేయక పోగా.. స్కూల్స్ ను మూసేసిన ఘనుడు చంద్రబాబు.
ఆరోగ్య రంగంపై చంద్రబాబుకు ఉన్న విజన్ ఏంది?. ప్రభుత్వం ఆస్పత్రుల్లో పేదల నుంచి డబ్బులు తీసుకునే విజన్ చంద్రబాబుది. ఇంకా దారుణం ఏమిటంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేశావు. 108 , ఆరోగ్యశ్రీ, లాంటివి ప్రవేశపెట్టిన వైఎస్సార్ గారిది విజన్. అలానే ఆరోగ్య శ్రీ కింద 3వేలకు పైగా జబ్బులు చేర్చిన సీఎం జగన్ ది విజన్” అంటూ పేర్ని నాని చంద్రాబు ఆవిష్కరించిన విజన్ పై ఘాటూగా స్పందించారు. మరి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీడీపీలో ఉండవల్లి శ్రీదేవికి చుక్కలు! బాబుని నమ్మితే అంతే మరి!