iDreamPost

టీడీపీలో ఉండవల్లి శ్రీదేవికి చుక్కలు! బాబుని నమ్మితే అంతే మరి!

టీడీపీలో ఉండవల్లి శ్రీదేవికి చుక్కలు! బాబుని నమ్మితే అంతే మరి!

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అనేక విమర్శలు వస్తుంటాయి. ఆయన నమ్మిన వారికి మొండి చేయి చూపిస్తారని, వెన్నుపోటు పొడుస్తారంటూ ప్రత్యర్థులు అంటారు. ఆ మాటలకు బలం చేకూర్చేలానే చంద్రబాబు చేసే రాజకీయాలు కనిపిస్తుంటాయి. అసెంబ్లీ, ఎమ్మెల్యే సీటు ఇస్తానని నమ్మించి.. చివరి వరకు ఎదురు చూసేలా చేసి.. చివరకు నిరాశ పర్చిన  సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాక నమ్మివచ్చిన వారికి..చెప్పిన స్థానం కాకుండా ఇతర స్థానాలు ఇచ్చి..వారిని నిరాశకు గురి చేసేవారు. ఇలా ఎందరో చంద్రబాబు చేతిలో మోసపోయిన వాళ్లు ఉన్నారని ప్రత్యర్ధులు అంటున్నారు. తాజాగా వారి జాబితాలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా చేరిందంటున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని తాడికొండ నియోజకవర్గం నుంచి  ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలుపొంది.. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైద్యురాలైన ఆమె..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలతో ఆమెను పార్టీ దూరం పెట్టింది. చివరకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే ఆరోపణలతో వైసీపీ  అధినాయకత్వం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం టీడీపీలోకి చేరే ప్రయత్నాలు చేసింది. ఈక్రమంలోనే ఇటీవల ఉత్తరాంధ్రలో చంద్రబాబు ఏర్పాటు చేసిన సభకు ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. అంతేకాక కష్టకాలంలో చంద్రబాబు, లోకేశ్ తనను కాపాడరని తెలిపారు.

అయితే తాజాగా టీడీపీ తీసుకున్న నిర్ణయంతో ఆమె రాజకీయం అగమ్యగోచరంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమెను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు  ఓ కండీషన్ పెట్టినట్లు  సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి టీడీపీ తరపున శ్రీదేవి పోటీ చేయాలని భావించారు. అక్కడ అవకాశం లేని పక్షంలో పక్క నియోజకవర్గమైన ప్రత్తిపాడు స్థానం నుంచైనా  అవకాశం ఇవ్వాలని బాబును కోరుతున్నట్లు తెలిసింది. అయితే తాడికొండలో ఇప్పటికే మాజీ  ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు టీడీపీ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. అలానే ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ ఐఏఎస్ రామాంజనేయులకు  అవకాశం ఇస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవిని అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా బాపట్ల ఎంపీగా పోటీ చేయించాలని  ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఎంపీగా పోటీ చేయడం అనే విషయం శ్రీదేవిని నిరాశకు గురిచేసినట్లు తెలుస్తుంది. తాడికొండ అయితే సొంత నియోజకవర్గం పరిధి తక్కువ కాబట్టి అక్కడి నుంచి పోటీచేయలని భావించందని, అయితే ఎంపీగా పోటీ అంటే చాలా కష్టమనే భావనలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఎంపీ స్థానం కింద ఉన్న అసెంబ్లీ స్థానల్లోని టీడీపీ నాయకులు ఆమెకు సహకరిస్తారా? అనేది సందేహం.

ఈ నేపథ్యంలో చంద్రబాబు చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీదేవి చేరిందని కొందరు అంటున్నారు. గతంలోనూ కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లింది. అక్కడ బాబు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి వైసీపీ కూడికి చేరింది. ప్రస్తుతం బుట్టా రేణుక రాజకీయంలో ఉన్నా లేనట్లే  ఉంది. తాజాగా శ్రీదేవి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా  మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. మరి.. ఉండవల్లి శ్రీదేవికను.. చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి