ఓ ఫోన్ కాల్‌తో జీవితం నాశనం! నాన్నకి చివరి లెటర్ రాసి !

ఓ ఫోన్ కాల్‌తో జీవితం నాశనం! నాన్నకి చివరి లెటర్ రాసి !

చిన్న అపార్థం వల్ల కన్నబిడ్డను కోల్పోయాడు ఓ తండ్రి. చివరకు ఆమె రాసిన సూసైడ్ లేఖ చదివి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఆమెను అనుమానించానంటూ గుండెలవిసేలా రోదించాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?

చిన్న అపార్థం వల్ల కన్నబిడ్డను కోల్పోయాడు ఓ తండ్రి. చివరకు ఆమె రాసిన సూసైడ్ లేఖ చదివి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఆమెను అనుమానించానంటూ గుండెలవిసేలా రోదించాడు. ఇంతకు ఏం జరిగిందంటే..?

చిన్న అనుమానం, అపార్థం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆవేశంలో, అనాలోచితమైన చర్య వల్ల ఎంతో జీవితాన్ని చూడాల్సిన యువతి తనను తాను బలితీసుకుంది. ఉన్నత చదువులు చదివి ఇంటికి వస్తుందనుకున్న కూతురు..నిర్జీవంగా చేరుకుంది. ఆమె మరణానికి పరోక్షంగా కారణమయ్యాడు తండ్రి. అందుకే అతడికి ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. నువ్వు నమ్మకుంటే ఎలా నాన్న అంటూ ఆమె చివరి మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే.. కూతురు ఎవరితోనే ప్రేమలో ఉందనుకున్న తండ్రి.. ఆమెను నిలదీసేందుకు కాలేజీకి వస్తానని చెప్పడంతో మనస్థాపానికి గురై.. ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె ళితే..

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరీ దంపతులు డోన్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రేణుక ఎల్లమ్మ పల్నాడు జిల్లా మాచర్ల‌లోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో అక్కడ ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. రేణుకను సొంత చెల్లెలిగానే భావించేవాడు అతడు. ఈ క్రమంలో ఆదివారం సాయత్రం రేణుకకు ఫోన్ చేశాడు ఆ అబ్బాయి. ఆమె ఎన్నిసార్లు ఫోన్స్ తీయకపోయే సరికి.. ఆమె తండ్రి గౌరప్పకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అయితే రేణుక ఫోన్ తీయడం లేదని తనకు అబ్బాయి కాల్ చేసి చెప్పడంతో తండ్రి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అలానే ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే రేణుకకు ఫోన్ చేసి మందలించాడు.

కాలేజీలో చదువుకునే అమ్మాయికి అబ్బాయిలతో పనేంటీ అంటూ అనుమానించేలా ప్రశ్నించే సరికి రేణుక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ విషయంపై కాలేజీకి వచ్చి మాట్లాడతానని తండ్రి చెప్పడంతో మరింత ఆందోళన పెరిగిపోయింది. తండ్రికి వద్దని చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేకపోవడంతో సమస్యకు పరిష్కారం లేదని భావించిన యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. అందులో హృదయం ధ్రవీంచే వ్యాఖ్యలు ఉన్నాయి. ‘నాన్న నేను ఏ తప్పు చేయలేదు. నీ పరువు తీసే పని నేనేప్పుడు చెయ్యను. నాన్న నువ్వే నా ధైర్యం,నువ్వే నమ్మకుంటే ఎవరు నమ్ముతారు. నేను తప్పు చేశాను అనుకుంటే బతకడం వ్యర్థం. నీతో మాట్లాడిన అన్న ఏ తప్పు చేయలేదు. నన్ను అమ్మలా భావిస్తాడు’ అంటూ లేఖ రాసింది. కూతురు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. లేఖ చూసి కూతుర్ని అపార్థం చేసుకున్నానని తల్లడిల్లిపోయాడు తండ్రి.

Show comments