iDreamPost

మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మహిళకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించిన రేవంత్ సర్కార్ మహిళలకు మరో తీపి కబురును అందించింది.

తెలంగాణ ప్రభుత్వం మహిళకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్నికల్పించిన రేవంత్ సర్కార్ మహిళలకు మరో తీపి కబురును అందించింది.

మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో మహాలక్షీ పథకం ద్వారా మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తుంది. అదే విధంగా ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షల వరకు పెంచింది. త్వరలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే గ్యాస్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మహిళలకు మరో తీపి కబురును అందించింది. త్వరలోనే వారికి వడ్డీలేని రుణాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.

రేవంత్ సర్కార్ మహిళా సంక్షేమం కోసం.. అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వారిని ఆర్థికంగా ఆదుకుని అభివృద్ధిపథంలో నడిపించేందుకు రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. దీనిలో భాగంగా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన రుణాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. డ్వాక్రా గ్రూపుల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భట్టి తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న భట్టివిక్రమార్క దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హామీనిచ్చారు.

Another good news for women

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి